మోడీ నియంతృత్వనికి దురహంకారానికి పరాకాష్ట కాంగ్రెస్ నాయకులు
* దేశ చరిత్రలోనే చీకటి రోజు
* ప్రశ్నించే గొంతును నొక్కుతూన్న మోడీ
* కేంద్ర ప్రభుత్వ చర్యను ప్రజా సమ్యవాదులంతా ఖండించాలి తక్షణం అనర్హత వేటు ఎత్తివేయాలి
* టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ
కొత్తగూడెం Kothagudem : కొత్తగూడెం నియోజకవర్గం స్థానిక బస్టాండ్ సెంటర్ రైటర్ బస్తి లో గల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏడవల్లి కృష్ణ మాట్లాడుతూ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు దుర్మార్గమైన చర్యను నిరసిస్తూ మోడీ నియంతృత్వ పాలనకు ఈ ఘటన నిదర్శనం అని, రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని,మోడీ భావ ప్రకటన హక్కును కాలరాస్తున్నడని,రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ను చూసి మోడీ కి భయం పట్టుకుందని,అందుకే ఇంతటి నీచమైన చర్యకు పాల్పడ్డారని,గతంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సోనియాగాంధీ ,రాహుల్ గాంధీ కుటుంబల మీద చేసిన వాక్యాలు మోడీ కి గుర్తుకు రాలేదా అని, ఇలా అనర్హత వేటు వేసుకుంటూ పోతే ముందుగా బీజేపీ వారిపైన వేయాల్సి వస్తుందన్నారు.భారత్ జోడో ద్వారా ప్రజల్లో రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజాదారణ చూసి,యాత్ర లో ప్రజల ద్వారా తెలుసుకున్న సమస్యలను పార్లమెంట్లో రాహుల్ గాంధీ మోడీని ఎండకడతారని భావించి ఇటువంటి హేయమైన చర్య పాల్పడ్డారని ద్వజమెత్తారు.రాహుల్ గాంధీ మోడీ అదాని చీకటి ఒప్పందం పై మాట్లాడి పార్లమెంట్ సాక్షిగా పోరాటం చేయడం.
మోడీకి కంటిమీద కునుకు లేకుండా చేశాయని, రాజకీయ ప్రసంగాలపై కేసులు పెట్టి అనర్హత వేటు వేయడం సరియైనది కాదని అన్నారు.దేశంలో అనేకమంది ప్రజాప్రతినిధులు అసభ్యపదజాలంతో మాట్లాడుతున్నారని,వారందరి పై అనర్హత వేటు వేసే దమ్ము బీజేపీ ప్రభుత్వానికి మోడీ కి ఉందా అని ప్రశ్నించారు.ఈ విషయం పై న్యాయపరంగా పోరాటం చేస్తామని అన్నారు.కాంగ్రెస్ నాయకులు.కార్యకర్తలు అభిమానులు దేశం మొత్తం కూడా ఒక్కటై పోరాడాలి కేవలం రాజకీయ కక్ష సాధింపు ప్రసంగాలు చేస్తే అనర్హులు గా చేస్తారా.మోడీ కి బి.జే.పి ప్రభుత్వానికి భయపడేది లేదు దేశ ప్రజల అండదండలు మా నాయకుడు రాహుల్ గాంధీ కి మెండుగా ఉన్నాయి తక్షణం అనర్హత వేటు ఎత్తివేయాలి ఇట్టి విషయంలో మా రాహుల్ గాంధీ ఉరుకున్న దేశ ప్రజలు సహించరు అని హెచ్చరించారు ఏడవల్లి .ఈ కార్యక్రమంలో :కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్,లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరావు,చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్,బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,కొత్తగూడెం పట్టణ యస్సీ సెల్ అధ్యక్షులు కల్లేపల్లి రాజా,INTUC నాయకులు జిలిల్,లక్ష్మీదేవిపల్లి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్,INTUC నాయకులు సైమన్,కాంగ్రెస్ నాయకులు కలిపాక సత్యనారాయణ, రాముర్తీ,ఫైజుద్దిన్,కొత్తగూడెం పట్టణ ఎస్టీ సెల్ నాయకులు భూక్యా శ్రీనివాస్,చుంచుపల్లి యూత్ నాయకులు శనగ లక్ష్మణ్,చుంచుపల్లి మండల మైనార్టీ నాయకులు పక్రొద్దిన్, బట్టు గణేష్,మొద్దు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు చదవడానికి క్లిక్ చేయండి...
* గ్రామాలలో దొంగతలు... ప్రజలు జాగ్రత్త ఉండాలి ఎస్ఐ ఇక్కడ క్లిక్ చేయండి
* నీళ్లపల్లి గ్రామపంచాయతీకి జాతీయ పంచాయతీ అవార్డు ఇక్కడ క్లిక్ చేయండి