పీఎం మోదీ పై మంత్రి కేటీఆర్ ఫైర్
* నీతి లేని పాలనకు పర్యాయపదం ఎన్డీఏ ప్రభుత్వం
* బీజేపీలో చేరగానే కేసులన్నీ మాయం
* 2014 తర్వాత 5,422 కేసులు
* అదానీ మీద ఏ కేసు ఉండదు
* జవాబు చెప్పే దమ్ము బీజేపీ నాయకుడికి ఉందా
* డబుల్ ఇంజిన్ అంటే మోదీ,అదానీ
హైదరాబాద్ Hyderabad : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు ఇచ్చింది ఈడీ సమన్లు కాదు కచ్చితంగా మోదీ Modi సమన్లు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ Ktr మీడియాతో మాట్లాడారు ఒక పరంపరలో భాగంగా దేశంలో గత 8 ఏండ్లుగా జరుగుతున్న ప్రహసనంలో భాగంగా ఇవాళ అయితే జుమ్లా లేకపోత ఆమ్లా అనే విధానంలో మోదీ ప్రభుత్వం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.మా మంత్రి గంగుల మీద ఈడీ, సీబీఐ దాడులు చేయించారు.మల్లారెడ్డి మీద ఐటీ దాడులు చేయించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ ఇంటి మీద ఈడీ దాడి చేసింది. జగదీశ్ రెడ్డి పీఏ ఇంటి మీద ఐటీ దాడులు చేసింది. నామా నాగేశ్వర్ రావు మీద ఈడీ దాడులు చేయించింది. వద్దిరాజు రవిచంద్రపై సీబీఐ దాడులు చేసింది. పార్థసారథి రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డిపై ఐటీ దాడులు చేయించారు. ఎమ్మెల్సీ రమణపై ఈడీ విచారణ జరిపారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ విచారించింది.మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ ఐటీని ఉసిగొల్పింది. అక్కడ చేయగలిగింది ఏమీ లేక కేసీఆర్ నాయకత్వంలో దేశంలో బీఆర్ఎస్ పురోగమిస్తున్న విధానం, తెలంగాణలో ఒక అజేయమైన శక్తిగా ఎదిగిన విధానాన్ని గమనించిన తర్వాత ఎమ్మెల్సీ కవితకు కూడా ఈడీ సమన్లు పంపింది. ఇవి ఈడీ సమన్లు కాదు కచ్చితంగా మోదీ సమన్లు.ఇది రాజకీయంగా చేసే చిల్లర ప్రయత్నం. సీబీఐ, ఈడీ, ఐటీ కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలాగా మారాయాని కేటీఆర్ ధ్వజమెత్తారు.
నీతిలేని పాలనకు నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు ఈ రోజు పర్యాయపదంగా మారింది ఎన్డీఏ ప్రభుత్వం అని కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షాలపై కేసుల దాడి.. ప్రజలపై ధరల దాడి ఇవి తప్ప వీరు సాధించింది ఏమీ లేదు. కేంద్రాన్ని, ప్రధాని మోదీని ఒక్కటే అడుగుతున్నా. గౌతమ్ అదానీ ఎవరి బినామీ ఆయన మోదీ బినామీ అని చిన్న పిల్లగాడు కూడా చెప్తాడు. అదానీపై హిండెన్ బర్గ్ సంస్థి రిపోర్టు ఇచ్చిన కేంద్రం మాట్లాడలేదు.ఎల్ఐసీ,ఎస్బీఐకి చెందిన రూ.13 లక్షల కోట్ల డబ్బులు ఆవిరైనా ఈ దేశ ప్రధాని ఉలకడు పలకడు. ఆర్థిక మంత్రి స్పందించరు. బినామీని కాపాడుకునే బాధ్యత వారిపై ఉంది కాబట్టి స్పందించడం లేదు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఒక వ్యక్తికి అనుకూలంగా నిబంధనలు మార్చి అదానీకి ఆరు ఎయిర్‌పోర్టులు ఇచ్చి దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.అవినీతికి పాల్పడే అదానీ మీద ఏ కేసు ఉండదు. అదానీకి చెందిన ముంద్రా పోర్ట్‌లో 21 వేల కోట్ల విలువ చేసే హెరాయిన్ దొరికితే కేసు కాలేదు. అదానీని విచారించే దమ్ము దర్యాప్తు సంస్థలకు ఉందా అని కేటీఆర్ నిలదీశారు.
ఎమ్మెల్సీ కవిత దిల్లీ...రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది |
బీజేపీలో చేరగానే కేసులన్ని ఏమై పోతున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు.సుజనా చౌదరి, సీఎం రమేశ్ బీజేపీలో చేరగానే కేసులన్ని మాయమైపోయాయి.సుజనా చౌదరిపై 6 వేల కోట్ల కేసు ఏమైంది.ఈ దేశంలో ఏం జరుగుతుంది.అదానీపై శ్రీలంక ఆరోపణలపై మోదీ సమాధానం చెప్పాలి.బీబీసీ మీద దాడి చేసిన వ్యక్తి మీరేంత అని ఇండియా మీడియాపై మోదీ అహంకారం ప్రదర్శిస్తున్నారు.జీ టూ జీ అంటే గవర్నమెంట్ టూ గవర్నమెంట్ కాదు గౌతం అదానీ టూ గొటబాయ డీల్ అని శ్రీలంక ప్రతినిధి అన్నారని కేటీఆర్ తెలిపారు.
2014 తర్వాత ప్రతిపక్షాలపై 5,422 ఈడీ కేసులు నమోదు అయ్యాయ అని కేటీఆర్ తెలిపారు. 23 కేసుల్లో మాత్రమే తీర్పు వచ్చింది. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనేదే మోదీ ప్రధాన ఉద్దేశం. కాంగ్రెస్ మీద 24, టీఎంసీ 19, ఎన్సీపీ 11, శివసేన ఉద్ధవ్ థాక్రే 8 కేసులు నమోదు అయ్యాయి.డీఎంకే 6, బీజేడీ మీద 6 ఈడీ కేసులు నమోదు అయ్యాయని వివరించారు. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు.అతనిపై ఎలాంటి కేసులు నమోదు కాదు. నేను బీజేపీ ఎంపీనని ఒకాయన డైరెక్ట్ కామెంట్ చేశాడు. తనపై ఈడీ దాడులు జరగవని స్పష్టం చేశారు.
9 ఏండ్ల పాలనలో 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన మాట వాస్తవం కాదా పెద్ద ఎత్తున పార్టీలను చీల్చిన మాట నిజం కాదా..? డబుల్ ఇంజిన్ అంటే దేశానికి అర్థమైంది.ఒక ఇంజిన్ మోదీ,ఇంకో ఇంజిన్ అదానీ. అడ్డమైన దొంగ సొమ్ముతో ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీలను చీల్చి, లొంగని వారిపై ఈడీ, సీబీఐ దాడులు చేయించాలి.అదేపనిగా పెట్టుకున్నారు. మునుగోడులో ఒక వ్యక్తికి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది వాస్తవం కాదా..? దీనిపై ఇప్పటి వరకు జవాబు చెప్పే దమ్ము బీజేపీ నాయకుడికి ఉందా..? విదేశాల్లో బొగ్గును ఎందుకు కొనాలి.. అని సీఎం కేసీఆర్, యూపీ సీఎం కేంద్రాన్ని అడిగితే ఇంత వరకు స్పందన లేదు. కర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని పత్రికలు చెబుతున్నాయి. మోదీ – అదానీ స్నేహం గురించి అందరికీ తెలుసు అని కేటీఆర్ తెలిపారు.