మందు బాబులకు షాక్..మద్యం షాప్ లు బంద్
Liquor shops are closed
తెలంగాణ Telangana : ఈ నెల 13న టీచర్ ఎమ్మెల్సీ MLC elections ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్,రంగారెడ్డి మహబూబ్‌నగర్,జిల్లాల్లో రెండు రోజుల పాటు మద్యం షాపులను మూసివేయనున్నారు.ఈ మూడు జిల్లాల్లో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
మహబూబ్ నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయి.మార్చి 16న ఓట్ల లెక్కింపు జరగనుంది.ఈ ఎన్నికలకు మొత్తం 137 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అందులో 126 మెయిన్ పోలింగ్ స్టేషన్లు ఉండగా 11 అదనపు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
మొత్తం 29,720 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 15,472, స్త్రీలు 14,246, ఇతరులు 2 ఓట్లు ఉన్నాయి. ఏర్పాటు చేసిన 137 పోలింగ్ స్టేషన్లలో మహబూబ్ నగర్ జిల్లాలో 15 పోలింగ్ స్టేషన్లు, నాగర్ కర్నూల్ 14, వనపర్తి 7, జోగులాంబ గద్వాల్ 11, నారాయణ పేట్ 5, రంగారెడ్డి జిల్లాలో 31, వికారాబాద్ 18, మేడ్చల్ మల్కాజ్ గిరి 14, హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది.