Type Here to Get Search Results !

Sports Ad

ఎమ్మెల్సీ కవిత దిల్లీ...రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది MLC Kavita Delhi has become a topic of discussion in political circles


 ఎమ్మెల్సీ కవిత దిల్లీ...రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది

హైదరాబాద్ : బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత దిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో ఆమె దిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎల్లుండి దిల్లీలో ధర్నా నిర్వహించాలని భావిస్తున్న ఆమె ఈడీ విచారణకు మరో రోజు హాజరుకావాలని యోచిన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఈడీ నోటీసులపై న్యాయవాదులు బీఆర్​ఎస్ నేతలతో ఎమ్మెల్సీ కవిత చర్చలు జరిపారు.
 దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసి రేపు విచారణకు రావాలని సూచించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం ఎమ్మెల్సీ కవిత దిల్లీకి బయలు దేరి వెళ్లడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కవిత దిల్లీ పయణమయ్యారు.

    ఎల్లుండి దిల్లీలో జంతర్​మంతర్​ వద్ద మహిళా రిజర్వేషన్లపై ధర్నాకు కవిత పిలుపునిచ్చారు. భారత జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నారు. దిల్లీ బయలు దేరే ముందు ఎమ్మెల్సీ కవిత ఈడీ నోటీసులపై న్యాయవాదులతో చర్చించారు. ఈడీ విచారణకు మరో రోజు హాజరుకావాలని కవిత యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో రోజురోజుకు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 11మందిని అరెస్టు చేసిన ఈడీ అధికారులు వారి వాంగ్మూలంసేకరించిన వివరాలు తమ దర్యాప్తులో తేలిన ఆధారాల మేరకు కవితను విచారించేందుకు సిద్ధమయ్యారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో రామచంద్ర పిళ్లైను విచారించిన ఈడీ అధికారులు ఆయన కవిత బినామీ అని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ నేతలకు 100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్ గ్రూప్ గుప్పిట్లో ఉన్న ఇండో స్పిరిట్స్ సంస్థలో పిళ్లై కవిత తరపున భాగస్వామి అని మంగళవారం దిల్లీ రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హజరుపరిచిన సందర్బంగా రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

    ఈ నేపథ్యంలోనే గురువారం దిల్లీలో విచారణకు హాజరుకావాలంటూ ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. గురువారం ఉదయం 11 గంటలకు కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాల్సిందిగా ఈడీ అధికారులు కవితకు సూచించారు.ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత  కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు తెలంగాణ తలవంచదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ బీఆర్​ఎస్ పార్టీని లొంగతీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటామన్న కవిత దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతామని తెలిపారు చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానన్న ఆమె దిల్లీలో ఎల్లుండి జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా సహా ముందస్తు అపాయింట్మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని స్పష్టం చేశారు.

                 పీఎం మోదీ పై మంత్రి కేటీఆర్ ఫైర్

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies