వాతావరణంలోని కొత్త మార్పులు
హైదరాబాద్: రాష్ట్రంలో కొన్ని రోజులు వేడి నుంచి ఉపశమనం లభించనుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడింది. దేశంలోని తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలోకి దిగువ స్థాయిన ఉన్నటువంటి ప్రాంతాలలో అధిక గాలులు వీస్తున్నయని అధికారులు తెల్చి చెప్పారు .విటి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి.కావున ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 16వ తేదీ అనంతరం పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని సూచిస్తున్నారు. మరోవైపు శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలన్నీ సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సాధారణం కన్నా 2.6 డిగ్రీలు తక్కువగా 32.7 డిగ్రీల సెల్సియస్ నమోదయిందని అధికారులు తెలిపారు.