బిజెపి ప్రభుత్వం మతవిద్వేషాలను రేపుతోంది
* దేశంలో మతవిద్వేషాలను పెంచి పోషిస్తూ ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం
* భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల 92 వ వర్థంతి
* PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్
తాండూర్ Tandur : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో గలా SC బాలుర వసతి గృహంలో PDSU ఆధ్వర్యంలో భగత్ సింగ్ 92 వ వర్ధంతి సభల పోస్టర్లను విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ మాట్లాడుతూ మార్చి 23న భగత్ సింగ్ రాజగురు, సుఖదేవుల 92వ వర్ధంతి సందర్భంగా దేశంలో జరుగుతున్న మత విద్వేష, ఉన్మాద దాడులకు వ్యతిరేక పోరాట నినాదంతో వర్ధంతి సభలు జరుపుకోవాలని విద్యార్థి-యువకులకు పిలుపునిచ్చారు.వలస పాలకుల దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడుతూ భారతీయ సమాజానికి ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం ఇచ్చి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో నిద్రపోయి 23 సంవత్సరాల ప్రాంతంలోనే ఉరికొయ్యలపై ఊయలలూగి చెరసాలలను హేళన చేసి అమరత్వం పొందిన వీరులు భగత్ సింగ్,రాజగురు,సుఖదేవులు నేటి తరానికి స్ఫూర్తి కావాలని అన్నారు.
భారతీయ సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతల్లో మతం ఒకటి అంటూ మతంపై భగత్ సింగ్ స్పష్టమైన వైఖరితో ఉన్నాడని వారు అన్నారు. ప్రజల అజ్ఞానాన్ని మూఢనమ్మకాలని పాలకులు తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఎలా ఉపయోగించుకుంటారో వివరిస్తూ అన్ని మతాల సారం అంతిమంగా దోపిడీ పాలకవర్గాలకు ఉపయోగపడేదేనని కుండబద్దలు కొట్టినట్లు ప్రజలకు భగత్ సింగ్ విడమర్చి చెప్పాడని వారు తెలిపారు.నేడు దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మతతత్వ విధానమేనని దేశంలో మతవిద్వేషాలను పెంచి పోషిస్తూ ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం మోపుతూ ప్రజాస్వామ్య హక్కులను కాల రాస్తూనే తిరిగి భగత్ సింగ్ కు నిజమైన వారసులం మేమే అంటూ ముందు వరసలోకి వస్తున్న పచ్చి అభివృద్ధి నిరోధకుల మత తత్వశక్తుల పన్నాగాలను తిప్పికొట్టేందుకు నేటి విద్యార్థి యువతరం ముందుకు రావాలని ఆస్ఫూర్తితోనే జరిగే భగత్ సింగ్ రాజగురు,సుఖదేవుల వర్ధంతి సభలలో విద్యార్థి-యువతరం పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సభ్యులు ప్రకాష్ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.