వీది కుక్కల బెడద,వాటి నివారణ పై చర్యలు చేపట్టాలి
- మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు
తాండూర్ Tandur : తాండూరు మున్సిపల్ పరిధిలో వీధి కుక్కల బెడద మరియు వాటి నివారణకై చర్యలు చేపట్టాలని తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీమతి.పట్లోళ్ల దీప నర్సింలు గారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలసి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు గారు మాట్లాడుతూ తాండూరు పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని చిన్నారులు కుక్కకాటూకు గురవుతున్నారని.వీధి కుక్కల నుంచి చిన్నారులు,మహిళలు, వృద్ధులను కాపాడాలని,ఏబీసీ (ఎనిమల్ బర్త్ కంట్రోల్) స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహించాలన్నారు.కుక్కల బెడదను నివారించడానీకి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, ఇంజక్షన్లు ఇచ్చి వదిలేయడం కాకుండా శాశ్వత నివారణ మార్గాలు చేపట్టాలని, వీధుల గుండా ఒంటరిగా నడచి వెళ్లాలంటే చిన్నారులు, మహిళలు, వృద్ధులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వెంటనె వీధి కుక్కల ప్రమాధాన్ని గుర్తించి తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని వీధి కుక్కల నియంత్రణ కోసం తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరినట్లు ఆమె తెలిపారు.