డేంజర్ బెల్స్ తెలుగు రాష్ట్రాల్లో వ్యాపిస్తున్న వైరస్
* దేశంలో వైరస్ హెచ్3ఎన్2 వేగంగా వ్యాపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి.
* తాజాగా హెచ్3ఎన్2 తెలుగు రాష్ట్రాలకు పాకింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఐసీఎమ్ఆర్ అప్రమత్తం చేసింది.
* ప్రజలు మాస్కులు వాడటం లేదని కూడా వెల్లడించాయి.
* కరోనా కేసులు తగ్గిన తర్వాత ఇప్పుడు భారత్ లో హెచ్3ఎన్2 రకం వైరస్ బారిన పడేవారి సంఖ్య ఎక్కువైంది.
* సాధారణ జలుబు, ఫ్లూ జ్వరంలాగే దీన్ని కూడా లైట్ తీసుకున్నారు.
* అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరస్ విజృంభిస్తోంది.
* మరణాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది.
* ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది.
* తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు జరుగుతుండడం, వైద్యం కోసం తెలుగు రాష్ట్రాలకు క్యూకడుతున్న విదేశీయులు ఊపందుకున్న పర్యాటకం వైరసి.హెచ్3ఎన్2 వైరస్ వేగంగా వ్యాపించేందుకు కారణమవుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.