గ్రామాలలో దొంగతలు... ప్రజలు జాగ్రత్త ఉండాలి ఎస్ఐ
బషీరాబాద్ Basheerabad : బషీరాబాద్ మండల పరిధిలోని కొర్విచెడ్ ఘని పంచాయితీ రాథోడ్ కిషన్ Ag-42 yrs శుక్రవారం రాత్రి 10 గం||ల కి తన గదికి తాళము వేసి పక్క గదిలో పడుకున్నాడు. శనివారం రోజున ఉదయం 6 గం॥లకి లేచి చూడగా తన గది యొక్క తాళం విరగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువంలో లాకర్ తెరిచి వుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బీరువాలోని అర తులము బంగారు పుస్తెలు, అర తులము బంగారు చైను,మొత్తము కలిసి ఒక తులము బంగారము మరియు కొంత మొత్తము నగదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లుగా గుర్తించారు.
అదే గ్రామానికి చెందిన చవాన్ మోతీలాల్,వయస్సు 25yrs. శుక్రవారం రాత్రి తన ఇంటికి తాళము వేసి ప్రక్క ఇంటి వారి స్లాబ్ మీద పడుకున్నాడు. ఉదయం లేచి చూడగా తన ఇంటి తాము విరగ్గొట్టి ఇంట్లోని బీరువాను తెరిచి అందులోని నగదు అందాజ రూ.8,000/- రూపాయలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతించినట్లుగా గుర్తించారు. రాథోజ్ కిషన్ మరియు మోతీలాల్
పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది. మీ గ్రామంలలో ఎవరైన కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి మరియు మీ వస్తువులు, డబ్బులు, నగలు భద్రంగా ఉంచుకోవాలి,ప్రజలు జాగ్రత్త ఉండాలి అని బషీరాబాద్ పోలీసువారి సూచన.
మైల్వార్ అక్రమంగా ఇసుక తరలింపు
బషీరాబాద్ మండలంలో శనివారం రోజున తెల్లవారు జామున బషీరాబాద్ మండల పరిధిలోని మైల్వార్ శివారులో మున్నూరు శమప్ప అనే వ్యక్తి TS 34 బి 8 0631 అనే నంబరు గల ట్రాక్టర్తో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పట్టుకుని పోలీసు స్టేషన్ కు తరలించడం జరిగింది.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి తెలిపారు.