బిజెపికి రాజకీయంగా గుణపాఠం చెప్తాం
* ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ మరియు ఉపకులాల ప్రజలకు సామన అవకాశాలు దక్కుతాయి
* మాదిగల సంగ్రామ యాత్ర 4వ రోజుకు బషీరాబాద్ మండలనికి చేరుకుంది
* ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ళ శివ మాదిగ
బషీరాబాద్ Basheerabad : ఈ నెల 8న వికారాబాద్ జిల్లా దౌల్తబాద్ మండల కేంద్రంలోని డా.అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన మాదిగల సంగ్రామ 2వ విడత పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టడంలో నిర్లక్షం వహిస్తు 2014లో అప్పటి కేంద్ర ప్రతిపక్ష పార్టీ బీజేపీ తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో SC వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడుస్తున్నా మాదిగలను మోసం చేస్తూనే ఉంది ఆ మోసాన్ని నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎంఆర్పిఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి,జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ళ శివ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ పల్లెలో బిజెపి పై యుద్దాన్ని ప్రకటించి సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నారు.పాదయాత్ర ఈ రోజుతో 4వ రోజు బషీరాబాద్ మండల కేంద్రానికి చేరుకుంది.ఈ యాత్రకు కాంగ్రెస్ పార్టీ బషీరాబాద్ మండల అధ్యక్షుడు బి.శంకరప్పా ఎంఎస్పి మండల ఇంఛార్జి బి.కృష్ణ మాదిగ గణ స్వాగతం పలికారు.
స్థానిక డా.అంబేద్కర్ విగ్రహనికి పులమలలు వేసిన నాయకులు కోళ్ళ శివ మాదిగ మాట్లాడుతూ మాదిగల చిరకాల స్వప్నం ఎస్సీ వర్గీకరణ అని అన్నారు.వర్గీకరణ జరిగితేనే మాదిగలకు మరియు ఉప కులాల ప్రజలకు సమాన అవకాశాలు దక్కుతాయని వర్గీకరణతోనే విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయల్లో సామాన అవకాశాలు వస్తాయని అన్నారు.ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకపోతే బీజేపీ కి తెలంగాణలో రాజకీయ గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.ఈ పాదయాత్రలో ఎంఎస్పి వికారాబాద్ జిల్లా ఇంఛార్జి పి.ఆనంద్ మాదిగ బషీరాబాద్ మండలం ఎంఎస్పి ఇంఛార్జి బి.కృష్ణ మాదిగ ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్ మాదిగ ఎంఎస్ఎఫ్ బషీరాబాద్ మండలం ఇంఛార్జి జి. ప్రవీణ్ మాదిగ ఎంఆర్పిఎస్ బషీరాబాద్ మండల నాయకులు శేకర్ మాదిగ తిరుపతి మాదిగ సుభాష్ మాదిగ రాజు శెంకర్ మాదిగ సురేష్ తదితరులు పాల్గొన్నారు.