ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య
క్రైమ్ Crime : అనుమనస్పద స్థితిలో యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగర కలాన్ లో చోటు చేసుకుంది.ఈ సంఘటనకు సంబంధించిన మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్ ఆదిభట్ల సీఐ రవి కుమార్ కథనం ప్రకారం వివరాలు కొంగర కాలన్ తండాకు చెందిన పల్లవి (21) అనే యువతి కొంగర రావిరాలలో ఉన్న వండర్ లా గార్డెన్ లో పనిచేస్తుంది.రోజులాగానే గురువారం ఉదయం ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి రాక పోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెంది.ఆదిభట్ల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.రాత్రి పోలీస్ వాళ్ళు వెతికినా యువతి జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులను ఇంటికి పంపించారు. శుక్రవారం ఉదయం కొంగరకలన్ సమీపంలోని ఓ వెంచర్ లో యువతి ఉరివేసుకొని కనిపించింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం సివిల్ ఆస్పత్రి కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.