జూన్ 14వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
హైదరాబాద్ Hyderabad News : తెలంగాణ పదో తరగతి ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 14వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ పరీక్షలు జూన్ 22 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఫెయిలైన విద్యార్థులు మే 26వ తేదీ లోపు సంబంధిత స్కూల్లో పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
రీ కౌంటింగ్‌కు అవకాశం..
పది విద్యార్థులకు రీ కౌంటింగ్‌కు అవకాశం కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. రీ కౌంటింగ్‌కు రూ.500ల చొప్పున చెల్లించి మార్కులు మళ్లీ లెక్కించుకోవచ్చు. దీని కోసం ఫలితాలు విడుదలైన పదిహేను రోజుల్లో ఎస్‌బీఐ బ్యాంకులో చలాన్లు చెల్లించి, దాన్ని బోర్డులో సమర్పిస్తే రీ కౌంటింగ్‌కు అవకాశం ఇస్తారు.డీడీలు చెల్లవు అని మంత్రి స్పష్టం చేశారు.