ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 2కోట్లు కేటాయించిన ఎమ్మెల్యే
తాండూర్ Tandur News : తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు గదుల కోసం గౌరవ తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు కేటాయించిన రెండు కోట్ల రూపాయలతో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణం.ఎమ్మెల్యే గారు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులకు గదుల కొరత ఉందని తలంచి భవనం శిథిలావస్థలో ఉండదాన్ని గమనించి వెంటనే ఆ యొక్క భవనాన్ని డిస్మెంటల్ చేసి నూతన గదులు నిర్మించాలని రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించారు.తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల తరఫున ఇంచార్జ్ బిఆర్ఎస్వి విద్యార్థి భాగం జిలాని ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేశారు.