ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
న్యూఢిల్లీ New delhi : న్యూఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.11 వేల చదరపు అడుగుల స్థలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు.జీ ప్లస్ త్రీ విధానంలో భవన నిర్మాణం జరిగింది. లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, మొదటి, రెండు, మూడు అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులతో భవనాన్ని నిర్మించారు. మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుడి చాంబర్, పేషీ, కాన్ఫరెన్స్ హాల్‌ను ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు, కార్యాలయ రిసెప్షన్, క్యాంటీన్‌ను నిర్మించారు. 2, 3 అంతస్తుల్లో ఢిల్లీలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బస చేసేందుకు 18 గదులతో పాటు రెండు ప్రత్యేక సూట్ రూమ్‌లు నిర్మించారు. సూట్ రూమ్‌లో పార్టీ అధ్యక్షుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బస చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి.