బషీరాబాద్ మండలంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తనిఖీలు
బషీరాబాద్ Basheerabad News : బుధవారం రోజున వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తనిఖీలు చేశారు.మైల్వార్ గ్రామంలోకి శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, మన ఊరు-మనబడి పనులు, తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు.వరి కొనుకోలు కేంద్రం ప్రారంభించారు.జిల్లా పరిషత్ పాఠశాలలో కొనసాగుతున్న మన ఊరు-మన బడి మరమ్మతులను పరిశీలిస్తూ వచ్చి విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులన్నీ పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అనంతరం బషీరాబాద్ కేంద్రంలో కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద చెట్ల కింద కూర్చున్న జనాన్ని పిలిచి పనులెలా జరుగుతున్నాయని ఆరా తీశారు. ప్రజలతో ఎండలోనే నిలబడి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.అక్కడే ఉన్న తహసీల్దార్ వెంకట్ స్వామి, డీటీ వీరేశంబాబుల పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు గుర్తించేలా పని చేయాలన్నారు. పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.శిథిలావస్థకు చేరుకుని పెచ్చులూడి పడుతున్న తహసీల్దార్ కార్యాలయ మరమ్మతులకు రూ. 3 లక్షలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. కార్యాలయాన్ని సందర్శిస్తున్న సమయంలో శిథిలా వస్థకు చేరిన భవనం విషయాన్ని ఎంపీపీ కరుణ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో భవనాన్ని పరిశీలించిన కలెక్టర్ వెంటనే స్పందిస్తూ మరమ్మతులకు ఫైల్ను పంపించాలని, రూ.3 లక్షలు మంజూరు చేస్తానని తహసీల్దార్ కి చెప్పారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకట్ స్వామి, డీటీ వీరేశంబాబు, సూపరింటెండెంట్ విజయలక్ష్మీ,ఎంపీపీ కరుణఅజయ్ ప్రసాద్, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి,బిఆర్స్ నాయకులు నర్సిరెడ్డి (రాజు),ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి,పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.