అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి
బషీరాబాద్ Basheerabad News : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఓటు హక్కు పై అవగాహనా కార్యక్రమం నిర్వహించగా ఈ సంధర్బంగా ఉప తహసీల్ధార్ వీరేష్ బాబు,ఎంఆర్ఓ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజలందరూ ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంటుందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నాయకుని ఎన్నుకోవాలని సూచించారు. ఓటు హక్కును కలిగి ఉండడం ప్రథమ కర్తవ్యమని, అదే విధంగా దాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాకేష్ వీఆర్ఎ అహ్మద్ వివిధ పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.