డబుల్ ఓట్ ఉంటె..ఇక ఔట్!
* ఒక్కరికి ఒకటి కన్నా ఎక్కువ ఓట్లుంటే గుర్తించి తొలగింపు
* ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో పరిశీలన చేపట్టిన ఎన్నికల సంఘం
* ఇప్పటికే రాష్ట్రంలో 14 లక్షలకు పైగా 'మల్టిపుల్ ఓట్లు' రద్దు
తెలంగాణ Telangana News : సాధారణంగా ఒక్కరికి ఒకటే ఓటు ఉండాలి కానీ రెండు,మూడు ఓట్లు ఉంటె రద్దు చేసుకోవాలి.సొంతూరిలో ఒక ఓటు చదువుకున్న చోట మరో ఓటు ఉద్యోగం కోసం వలస వెళ్లిన చోట మరో ఓటు కొందరికైతే ఒకే నియోజకవర్గంలో వేర్వేరు చోట్ల ఓట్లు ఇలా చాలా మందికి ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. దీనితో ఎన్నికల సమయంలో గందరగోళం, కొన్నిసార్లు అక్రమాలకు ఆస్కారం కలుగుతోంది.ఈ క్రమంలో మల్టిపుల్ ఓట్లను ఏరివేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 14 లక్షలకుపైగా మల్టిపుల్ ఓట్లను గుర్తించి తొలగించింది. తాజాగా మరోదఫా పరిశీలనకు సిద్ధమైంది.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 మేరకు దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుంది. అయితే దేశంలో ఎక్కడో ఒక్కచోట మాత్రమే ఆ ఓటు నమోదై ఉండాలి.మరోచోటికి మారితే మొదట ఉన్నచోట రద్దు చేసుకుని కొత్త ప్రాంతంలో నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు.