సంఘీభావం తెలిపిన ఎంపీడీవో కంప్యూటర్ ఆపరేటర్స్
బషీరాబాద్ Basheerabad News : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు మంగళవారం రోజు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మె కొనసాగడం జరుగుతుంది.ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన ఎంపీడీవో కంప్యూటర్ ఆపరేటర్ సిబ్బంది, ఈ సందర్భంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల ప్రొబేషనరీ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించాలని రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శి లకు క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారించాలి ప్రకటించాలని పరస్పర బదిలీలు భార్యాభర్తలు బదిలీలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ కార్యసాధనలో మా వంతు పాత్రను పోషిస్తున్నాం. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు జీవో 26 ద్వారా మూడు సంవత్సరాల ప్రొబేషనరీ కాలాన్ని ఆ నాలుగు సంవత్సరాలకు పొడిగించారు.ఆ నాలుగు సంవత్సరాలు కాలం కూడా ముగిసిందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే క్రమబద్ధీకరణ జీవోవిడుదల చేయాలని ప్రభుత్వం స్పందించే వరకు సమ్మెను ఇదేవిధంగా కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండలం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.