భార్యను హత్య చేసిన కానిస్టేబుల్
క్రైమ్ న్యూస్ Crime News : కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన ఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం గౌతమీనగర్ లో శుక్రవారం చోటు చేసుకుంది.కానిస్టేబుల్ రాజ్ కుమార్ కుటుంబ కలహాలతో భార్య గొంతుకోసి ఫస్ట్‌ఫ్లోర్ నుండి కింద పడేశాడు. రాజ్ కుమార్ హైకోర్టు నాలుగో గేటు వద్ద విధులు నిర్వహిస్తుంటాడు. భార్యతో కలిసి వనస్థలిపురం గౌతమీనగర్ లో రాజ్ కుమార్ నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహలతో భార్య శోభను రాజ్ కుమార్ హత్య చేశాడు. భార్య గొంతుకోసి ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఎల్‌బీనగర్ డీసీపీ సాయిశ్రీ నేతృత్వంలోని పోలీస్ బృందం ఘటన స్థలంలో మరియు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం...
* హాస్టల్లో మూత్ర విసర్జనతో వంట చేస్తున్న మహిళ ఇక్కడ క్లిక్ చేయండి
* జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి
* భార్యను హత్య చేసిన కానిస్టేబుల్ ఇక్కడ క్లిక్ చేయండి