డాక్టర్ వేధింపులకు నర్సు ఆత్మహత్య
నిజామాబాద్ Nizamabad News భారత్ ప్రతినిధి : నిజామాబాద్ నియోజకవర్గంలోని మోపాల్ మండలంలోని ముదక్ పల్లి గ్రామంలో గౌతమి (25) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.. గౌతమి నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట చౌరస్తా వద్దగల మనోరమ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తుంది. ఇదిలా ఉండగా నగరంలో ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేసే తమ కూతురు గౌతమిని డాక్టర్ తీవ్ర వేధింపులకు గురి చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంత డబ్బు అవసరం మేరకు డాక్టర్ దగ్గర అప్పుగా తీసుకున్నామని పేర్కొన్నారు. ఆ డబ్బును వాయిదాల పద్ధతిన ప్రతినెల ఆస్పత్రిలో పనిచేసే గౌతమి వేతనం నుంచి కొంత డబ్బు చెల్లిస్తున్నామని గౌతమి తల్లి పేర్కొంది. డబ్బుల విషయమై కూడా తమ కూతురిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై మోపాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేస్తామని గౌతమి తల్లి స్పష్టం చేసింది. గౌతమి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమ వుతున్నాయని ఆత్మహత్య పై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు.