మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
* మర్పల్లి మండల ప్రజల దశాబ్దాల కళలకు సాకారం
వికారాబాద్ Vikarabad News : శనివారం రోజున రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు శ్రీమతి గౌరవ సబితా ఇంద్రారెడ్డి, వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్పల్లి మండల కేంద్రంలో 42.20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రంథాలయ భవనం, కల్కోడలో 2.74 కోట్ల నిధులతో విద్యుత్ సబ్ స్టేషన్ మరియు మర్పల్లి మండల కేంద్రంలో ఒక కోటి రూపాయల నిధులతో నిర్మించిన నూతన MPDO కార్యాలయాన్ని ప్రారంభించారు.మర్పల్లి మండల ప్రజల దశాబ్దాల కళలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని, మర్పల్లి మండలాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలును ప్రజలకు వివరించాలన్నారు.
ముఖ్యమంత్రి గౌరవ కెసిఆర్ గారి ఆదేశానుసారం జూన్ 2వ తేదీ నుండి 23వ తేదీ వరకు 21 రోజులపాటు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతి పల్లెన, ప్రతి వాడన ఘనంగా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో BC కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి , ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.