Type Here to Get Search Results !

Sports Ad

జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య Junior Panchayat Secretary commits suicide

 

జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

వరంగల్ Warangal News : వరంగల్ జిల్లాలో ఓ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖానాపూర్ మండలం రంగాపురం గ్రామ కార్యదర్శి సోని పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. సమ్మె విరమించి నిన్న విధుల్లో చేరిన సోని విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాక పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోని నేడు మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.15 రోజులుగా ఆగని సమ్మె తమను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జేపీఎస్‌లు నిరవధిక సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.

    గత 15 రోజులుగా విధులు బహిష్కరించిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు కలెక్టరేట్లు, మండల పరిషత్‌ కార్యాలయాల వద్ద నిరసనలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే జేపీఎస్‌లు తమ నిరసనలను ఆపేసి విధుల్లో చేరాలని ఇటీవల ప్రభుత్వం హెచ్చరించింది.9వ తేదీ సాయంత్రం కల్లా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు జేపీఎస్‌లకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా నోటీసులు జారీ చేశారు.

ప్రభుత్వ హెచ్చరికను ఖాతరు చేయని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వం దిగొచ్చే వరకు తగ్గేదే లే అంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. వివిధ రూపాల్లో తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని.. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా తమను రెగ్యులర్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తల కోసం... 
* హాస్టల్లో మూత్ర విసర్జనతో వంట చేస్తున్న మహిళ ఇక్కడ క్లిక్ చేయండి 
* జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి 
* భార్యను హత్య చేసిన కానిస్టేబుల్ ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies