Type Here to Get Search Results !

Sports Ad

సీఎం కప్ ఆటల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే MLA started the CM cup games competition

 

సీఎం కప్ ఆటల పోటీలను  ప్రారంభించిన ఎమ్మెల్యే 

తాండూరు Tandur News : తాండూరు పట్టణంలో శివాజీ చౌక్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహం చుట్టు సర్కిల్ నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి భూమి పూజ చేశారు.పైలెట్ రోహిత్ రెడ్డి MLA Pilot Rohith Reddy  మాట్లాడుతూ హిందూవులందరు ఐక్యమంతంగా ఉండాలని పోరాడిన మహానుభాహుడు ఛత్రపతి శివాజీ అని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆదర్శనంగా తీసుకొని తన అడుగు జాడలలో నడవాలని కోరారు.అనంతరం సెయింట్ మార్క్ హైస్కూల్‌లో సీఎం కప్ ఆటల పోటీలను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు ప్రారంభించారు.ఆటలు శరీరానికి దృఢని,చురుకుదనాన్ని అందిస్తుంది.ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఆటలు ఆడడం వ్యాయామం చేయాలని కోరారు.




మాజీ జెడ్పీటీసీ అంజయ్యను పరామర్శించిన్న ఎమ్మెల్యే 

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పెద్దేముల్ మాజీ జెడ్పీటీసీ అంజయ్య దవాఖానలో చికిత్స పొందుతుండడంతో ఇట్టి విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే హాస్పిటల్ కి వెళ్లి అంజయ్యను పరామర్శించారు.సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరమని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  తాండూరు నియోజకవర్గంలోని లబ్దిదారులు 20 మందికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు రూ.10 లక్షల 32వేలు విలువగల  సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ఎంతో మంది పేదలు కార్పొరేట్‌ వైద్యం చేసుకుంటున్నారని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం....  
* సీఎం కప్ ఆటల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇక్కడ క్లిక్ చేయండి 
* ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ ఇక్కడ క్లిక్ చేయండి
* జూన్ 1 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇక్కడ క్లిక్ చేయండి 
* బైరి సోనీ గారి ఆత్మకు శాంతి కలగాలని క్యాండిల్ ర్యాలీ ఇక్కడ క్లిక్ చేయండి


సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

గతంలో సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరు కావాలంటే సంవత్సరాలు పట్టేదని, ఇప్పుడు రెండు, మూడు నెలల్లోనే మంజూరవుతుందన్నారు.ప్రజలు ప్రభుత్వ స్కీములను ఉపయోగించుకోవాలని సూచించారు.మహిళలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు.ఆడబిడ్డ క్షేమం కోరుకునే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ఒకేరోజు 293 మంది లబ్దిదారులకు దాదాపు 3 కోట్ల రూపాయల విలువలగల  కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాలలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్,ప్రభాకర్ గౌడ్,విజయ్ కుమార్,మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న ,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సిములు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies