ప్రైవేటు స్కూళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
* విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్లు ప్రారంభం
* ప్రైవేటు స్కూళ్లపై చట్టపరమైన చర్యలు
* MEO గారికి వినతి పత్రం అందజేత
* PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ డిమాండ్
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తాండూర్ పట్టణంలో PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానిక తాండూరు పట్టణంలో విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్ నిర్వహిస్తూ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తు, ఎటువంటి నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. దానితోపాటు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా డొనేషన్ల పేరుతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర వసూలు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు పాఠశాలల యజమాన్యంపై క్రిమిన్ కేసులు పెట్టాలని, ప్రైవేట్ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేని వాటిపై స్థానిక విద్యాధికారులు స్పందించి వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక MEO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. త్వరలోనే PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తాండూర్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, రిలే నిహార దీక్షలు చేపడతామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా కమిటీ సభ్యులు నరేష్ , అంబోజి, వెంకట్ ,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.