ఇద్దరు అమ్మాయిలు నడి రోడ్డుపై...
వైరల్ న్యూస్ : సమాజంలో యువత చేసే ప్రయత్నాలు ప్రాణాల మిదిగి తెచ్చుకున్న విధంగా మారుతున్నారు.నడి రోడ్డుపై చిందులే కాదు బైకులతో స్టంటులు చేస్తున్నారు. అంత వరకు ఓకే కానీ లవర్స్‌తో చేసే చిత్ర, విచిత్ర విన్యాసాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుతోంది. అమ్మాయిలను బైక్ పై ఎదురు కూర్చొబెట్టుకుని హీరోయిజం చూపించడం, రెండు చేతులు వదిలి డ్రైవింగ్ చేయడం ఒక ఎత్తైతే ఏకంగా రొమాన్స్ చేసేస్తున్నారు.అది కూడా నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టడాలు, కౌగిలింతలు, చూడలేనటువంటి పనులు చేస్తూ అందరితో అక్షింతలు వేయించుకుంటున్నారు.
అయితే ఇప్పుడు ట్రెండ్ మార్చేందుకు ప్రయత్నించారు ఇద్దరు అమ్మాయిలు. నడి రోడ్డుపై రెచ్చిపోయారు ఇద్దరు యువతులు మగవాళ్లకు తామేమీ తీసుపోలేదని నిరూపించేందుకు సిద్ధమయ్యారు. కదులుతున్న బైక్ పై ఎదురెదురుగా కూర్చొని కౌగిలింతలు, ముద్దులు పెట్టుకోవడాలు చేశారు.అయితే ఈ వీడియో వైరల్ గా మారిన తర్వాత వివాదమో, మరే కారణమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వీడియో అందుబాటులో లేదు.కానీ నెటిజన్లు ఊరుకోరు కదా.. వెంటనే స్క్ర్కీన్ పాట్లను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే ఆ బైక్ తమిళనాడు నంబర్ ప్లేట్‌తో కనిపించగా ఇది జార్ఖండ్‌కు చెందిన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ అయినట్లు తెలుస్తోంది.
అయితే ఇది డిలీట్ చేసే సమయానికే 30 వేల లైకులు, 5 లక్షల 74 వేలకు పైగా వీక్షించారు. ఈ వీడియోపై కొంత మంది పన్నీగా రిప్లై ఇస్తుంటే మరికొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఇది యోగీ రాష్ట్రంలో జరిగితే బాగుండేది' అని సరదాగా రాసుకొచ్చారు ఓ నెటిజన్. 'పడిపోతే ఆ ముద్దులతోనే సరిపెట్టుకోవాలి. పేమస్ కావాలంటే మరీ ఇంతలా దిగజారాల్సిన అవసరం లేదు' అంటూ మరో నెటిజన్ ఫైర్ అయ్యారు. వీరికి చలానా విధించాలని మరో సోషల్ సైనికుడు.ఇలాంటి వాళ్లను కష్టపడి చదివిస్తున్నందుకు తల్లిదండ్రులను నిందించాలంటూ మరికొంత మంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరీ ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.