Type Here to Get Search Results !

Sports Ad

బాల్య వివాహాలు చేస్తే చర్యలు తీసుకుంటాం We will take action against child marriages

బాల్య వివాహాలు చేస్తే చర్యలు తీసుకుంటాం 

* బాల్య వివాహాలపై అవగాహన సదస్సు 
* చిన్నారుల జీవితాలతో వారి కుటుంబాలే చెలగాటం
* గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిళ్లు 
* బాల్య వివాహాలపై 1098కి కాల్ 
 * బాల్య వివాహాలకు ఆర్థిక స్థోమత ప్రధాన కారణం 
* బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు 

బషీరాబాద్ Basheerabad News : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన గుట్టుగా జరుగుతూనే వెల్లడిస్తున్నాయి. ఏటా వేల సంఖ్యలో వివాహాలు ఉన్నాయని తెలిపారు.పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లోపం, మత,కులపరమైన కట్టుబాట్ల వల్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఇప్పటికే వెల్లడైంది. కనీస అవగాహన లేని వయసులో వివాహాలు చేయటం వల్ల చిన్నారుల్లో శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని సామాజిక వేత్తలు, వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోషకాహార లోపం, రక్తహీనత, ఇతర సమస్యల వల్ల ప్రసవ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరూ మరణిస్తున్న సంఘటనలు ఇప్పటికే అనేకం చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.

సంక్షేమ శాఖ ఐసీడీఎస్ ప్రాజెక్టు జిల్లా మండల స్థాయి ప్రజాప్రతినిధులు అధికారులతో బాల్య వివాహాల నివారణ అవగాహన సదస్సులో సిల్సిపి, సిసిఎల్ డిస్ట్రిక్ ఆఫీసర్ నరేష్ తహశీల్ధార్ వెంకట్ స్వామి, ఎంఈఓ సుధాకర్ రెడ్డి, ఎస్సై విద్యాచారం రెడ్డి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ బాల్య వివాహాలు గుట్టుగా కొనసాగుతూనే ఉన్నాయని చట్టాలు హెచ్చరికలు చేస్తున్నా ప్రభుత్వాలు నియంత్రించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా చిన్నారుల జీవితాలతో వారి కుటుంబాలే చెలగాటం ఆడుతున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. మధ్యతరగతి కుటుంబాలు, ప్రేమ వివాహాలు, టెన్త్ ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు చిన్నవయసులోనే పెళ్లిళ్లు చేసి, బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయడం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 



బాల్య వివాహాలకు ఆర్థిక స్థోమత ప్రధాన కారణం  

జిల్లాలో గడిచిన సంవత్సరం నుండి 100 కు పైగా బాల్య వివాహాలకు అధికారులు అడ్డుకట్ట వేయగా దీనికి రెట్టింపు స్థాయిలో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిళ్లు జరిగినట్లు అంచనాలు ఉన్నాయన్నారు. ఇదే విషయాన్ని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి మరోవైపు ఎవరైనా సమాచారం అందిస్తేనే 1098, శిశు సంక్షేమశాఖ అధికారులు బాల్యవివాహాలను అడ్డుకోగలుగుతున్నారు. ఒకవైపు మహిళల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా ఇంకోవైపు జిల్లాలో 18 ఏళ్లలోపు వారికి బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు.
ప్రధాన కారణం ఆర్థిక కష్టాలేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.ఒకవైపు ఆర్థిక స్థితిగతులు సక్రమంగా లేని పరిస్థితుల్లో కరోనా మహమ్మారి పేద కుటుంబాలపై మరింత ప్రభావం చూపింది. అనేక మంది చిన్నారుల భవిష్యత్తును వివాహాల రూపంలో కాలరాచిందని చెప్పవచ్చు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడం, తల్లిదండ్రుల కష్టాలను చూసి, వారి మాట కాదనలేక చిన్నారులు పెళ్లిపీటలపై కూర్చుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.దీనికి తోడు గత రెండేళ్లుగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు కరోనా కారణంగా మూతపడటంతో భారీగా బాల్య వివాహాలు జరిగినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బషీరాబాద్ మండల కేంద్రం పరిధిలో ఖాసీంపూర్, మైల్వర్, జీవన్గి , తదితర గ్రామాలలో అధికంగా 1098కి కాల్స్ వచ్చాయన్నారు.



బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు 

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బాల్య వివాహాలను పరిశీలిస్తే 40 శాతం మన దేశంలోనే ఉన్నాయని తెలిపారు.ఈ తరహా ఘటనలు గిరిజన ప్రాంతాల్లో అత్యధికంగా నమోదువుతున్నాయన్నారు.చట్టప్రకారం కఠిన చర్యలు వివాహాలు చేసే వారిపైన,వాటిని ప్రోత్సహించే వారిపైన బాల్య వివాహా నిషేధ చట్టం-2006 ప్రకారం కఠిన చర్యలు తప్పవని మాతా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండక ముందే పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేస్తున్నారు.
 
బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు.అప్పటికీ మాట వినకపోతే కేసు నమోదు హెచ్చరిస్తున్నారు. బాల్య వివాహాల్ని వ్యతిరేకించి,చేయించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులతో విభేదించే బాలికలను పునరావాస కేంద్రాల్లో ఉంచి చదువు, ఉపాధి కల్పన ఏర్పాట్లు -చేస్తామని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సూపరెంట్ విజయ్ కుమారి,1098 కోఆర్డినేటర్ నరసింహులు, వివిధ మండలాల అంగన్వాడీ సూపర్వైజర్లు, జయశ్రీ,నిర్మల, రాణి, గీత, జ్యోతి, వాణిశ్రీ, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం...
* ఇచ్చిన హామీ నెరవేర్చే నాయకుడు ఎమ్యెల్యే పైలట్
ఇక్కడ క్లిక్ చేయండి 
* అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి
ఇక్కడ క్లిక్ చేయండి  
* బాల్య వివాహాలు చేస్తే చర్యలు తీసుకుంటాం
ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies