Type Here to Get Search Results !

Sports Ad

బైక్ కోనివ్వలేదని ఆగిన పెళ్లి... శబాష్ ఎమ్మెల్యే రసమయి The wedding stopped because the bike was not allowed...well done MLA Rasamayi

 

బైక్ కోనివ్వలేదని ఆగిన పెళ్లి... శబాష్ ఎమ్మెల్యే రసమయి

* బైక్ కొనివ్వలేదని ఓ పెళ్ళి కొడుకు ఏకంగా పీటల మీద పెళ్లి ఆపి
* పెళ్లి కూతురుకు కన్నీళ్లు పెట్టించి
* మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
* బైక్ లక్ష రూపాయల నగదు ఇచ్చి ఆగిపోయిన పెళ్లి జరిపించి

కరీంనగర్ Karimnagar News : పెళ్లి అంటే నూరేళ్ళ పంట అంటారు కానీ పెళ్లిలనే మంట లేపాడు ఓ పెళ్లి కొడుకు.కరీంనగర్ జిల్లా అంబాల్పూర్ మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మీ కూతురు అనూష వివాహం కుదిరింది. కట్నం కింద రూ.5 లక్షలతో పాటు బైక్ ఒప్పుకున్నారు.అమ్మాయి తల్లిదండ్రులది నిరుపేద దళిత కుటుంబం అయినప్పటికి అప్పోసప్పో చేసి పెళ్ళికి ముందే రూ.5 లక్షలు ముట్ట జెప్పారు. ఈరోజు కేశవపట్నంలోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహం జరగాల్సి ఉండగా నాకు బైక్ కొనిస్తేనే అమ్మాయి మెడలో తాళి కడుతాను లేకపోతే వెళ్ళిపోతాను అంటూ పెళ్లి కొడుకు భీష్మించడంతో పెళ్ళి కూతురు కుటంబ సభ్యులంతా కన్నీటి పర్యాంత మాయ్యారు.ఈ ఘటనను చూసిన ఎమ్మెల్యే రసమయి పెళ్లి కొడుకుతో మాట్లాడి నచ్చజెప్పి బైక్ నేను కొనిస్తాను అంటూ లక్ష రూపాయల నగదును పెళ్లి కొడుకు తండ్రి చేతిలో పెట్టాడు.మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఔధార్యాన్ని చాటుకున్నారు. దీంతో పెళ్ళికి అంగీకరించిన వినయ్ అనూష మేడలో తాళి కట్టడంతో కథ సుఖాంతం అయింది.

మరిన్ని వార్తల కోసం.... 
* బైక్ కోనివ్వలేదని ఆగిన పెళ్లి... శబాష్ ఎమ్మెల్యే రసమయి ఇక్కడ క్లిక్ చేయండి
* పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులను అభినందించిన పైలెట్ ఇక్కడ క్లిక్ చేయండి 
* అందరి బంధువుడు డా.బి.ఆర్ అంబేద్కర్ పైలెట్ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies