వాట్సాప్‌లో కొత్తగా ‘ఎడిట్’ ఆప్షన్ Whatsapp Edit message
టెక్నాలజీ Technology News : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. పొరపాటున ఏదైనా మెసేజ్ అవతలి వారికి పంపిస్తే దాన్ని డిలీట్ చేసుకునే ఆప్షన్ ప్రస్తుతం ఉంది. ఒకప్పుడైతే అదీ ఉండేది కాదు. తాజాగా మనం పంపించిన మెసేజ్‌లో ఏదైనా చిన్నపాటి తప్పు ఉంటే సరిచేసుకునేందుకు వీలుగా ‘ఎడిట్’ ఆప్షన్‌ను (Edit message) వాట్సాప్ తీసుకొస్తోంది. ప్రస్తుతానికి వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరికీ ఈ ఫీచర్ రానుంది.
వాట్సాప్ (WhatsApp) తీసుకొస్తున్న కొత్త ఫీచర్ కింద ఏదైనా సందేశాన్ని 15 నిమిషాల వరకు ఎడిట్ చేసుకోవచ్చుWhatsapp Edit message. అందుకోసం మనం పంపిన మెసేజ్‌పై క్లిక్ చేసి కాసేపు హోల్డ్ చేయాలి. అప్పుడు కాపీ అనే ఆప్షన్‌తో పాటు ఎడిట్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ‘ఎడిట్’ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మార్పులు చేసుకోవచ్చు. 15 నిమిషాల్లోపు ఎన్నిసార్లయినా ఎడిట్ చేసుకునే సదుపాయం ఉంది. ఒకసారి ఎడిట్ చేశాక ‘ఎడిటెడ్’ అనే సందేశం అవతలి వ్యక్తికి ఈ మెసేజ్ కింద కనిపిస్తుంది.
ఆండ్రాయిడ్ యాప్‌తో పాటు, ఐఓఎస్, వెబ్ యూజర్లకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చేదీ మాత్రం వాట్సాప్ వెల్లడించలేదు. మరోవైపు అంతర్జాతీయ కాల్స్ బెడద ఎక్కువైన నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌కు రింగ్ రాకుండా చేసే ఆప్షన్ సైతం ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉంది. ఈ రెండు ఫీచర్లు త్వరలోనే అందరికీ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.