75 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
* కర్ణాటక రాష్ట్రనికి చెందిన వ్యక్తి
* ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండల కేంద్రంలో 75 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న ఎస్ఐ.ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రోజున సాయంత్రం అందాజ 05:00 గంటల సమయంలో బషీరాబాద్ గ్రామంలోని బస్టాండ్ సమీపంలో ఒక వ్యక్తి నకిలీ పత్తి విత్తనాలు అమ్మడానికి తీసుకువెళ్తున్నాడని సమాచారం రాగా బషీరాబాద్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సూర్య ప్రకాష్ మరియు పోలీస్ సిబ్బందితో కలిసి, బషీరాబాద్ గ్రామంలోని బస్టాండ్ సమీపంలోకి వెళ్లి తనిఖీ నిర్వహించగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనబడగా అట్టి వ్యక్తి దగ్గరకు వెళ్లి తన వద్ద గల ప్లాస్టిక్ సంచిని చెక్ చేయగా అట్టి సంచిలో ఎటువంటి పేరు లేని నకిలీ పత్తి విత్తనాలు గల 15 ప్యాకెట్లు లభించినాయి మరియు తన పేరు వివరాలను అడుగగా తన పేరు శరణప్ప తండ్రి వెంకటప్ప, వయస్సు: 45 సంవత్సరాలు, నివాసం: ముధోల్ గ్రామం సేడం తాలుకగా కర్ణాటక రాష్ట్రం అని తెలిపాడు.అట్టి వ్యక్తిని ఎక్కడి నుంచి ఇట్టి పత్తి విత్తనాలు తెచ్చావు అనగా కర్ణాటక రాష్ట్రంలో తక్కువ ధరకు కొనుక్కొని వచ్చి బషీరాబాద్ మండలంలో తెలిసిన వారికి ఎక్కువ ధరకు అమ్ముకుంటాను అని తెలిపాడు.ఇప్పుడు మీ వద్ద ఇవే నకిలీ విత్తనాలు ఉన్నాయా ఇంకా ఏమైనా ఉన్నాయా అని అనగా అతను ఇంకా మా ఇంటి వద్ద ఉన్నాయని మాతో చెప్పగా వెంటనే అక్కడికి వెళ్లి తన ఇంటిలో చెక్ చేయగా తన ఇంటిలో 60 కిలోల పత్తి విత్తనాలు లభించినాయి. మొత్తం నకిలీ పత్తి నకిలీ విత్తనాలు 75 కిలోలు వీటి విలువ మొత్తం రూపాయలలో 1,35,000/- గలవు. ఇట్టి విషయంలో బషీరాబాద్ మండలo అగ్రికల్చర్ ఆఫీసర్ సూర్య ప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనది అని తెలిపారు.