Type Here to Get Search Results !

Sports Ad

దశాబ్ది ఉత్సవాల్లో పట్టణ ప్రగతి సంబరాలు Celebrating urban progress during the decade in Tandur

 


 దశాబ్ది ఉత్సవాల్లో పట్టణ ప్రగతి సంబరాలు

* పదేళ్ల పాలనలో పట్టణాలలో అద్భుతాలు
* నాడు మున్సిపాలిటీలు మురికి కూపాలు
* నేడు మునిసిపాలిటీలు ప్రగతి ముఖ ద్వారాలు
* నాడు గుంతల మయంగా పట్టణాలు
* నేడు వంతెనల రహదారులుగా నగరాలు 
* ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి

తాండూర్ Tandur News : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రోజున పట్టణ ప్రగతి కార్యక్రమం లో భాగంగా తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇందిరా చౌక్ లో జాతీయ జెండా ఆవిష్కరణ  చేసి మానవహారంగా ఏర్పడి ఇందిరా చౌక్ నుండి  కొత్త మున్సిపల్ ఆఫీస్ వరకు భారీ జనసందోహంతో ర్యాలీగా వెళ్లడం జరిగింది. అదే విధంగా మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా  ఆవిష్కరణ చేశారు.పైలట్ రోహిత్ మాట్లాడుతూ పాత మున్సిపల్ చట్టంలో ఉన్న లోటుపాట్లను అధ్యయనం చేసి వాటిని సరిదిద్దుకొని 2019లో ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ మున్సిపల్ చట్టంతో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు పట్టణాలను ఆధునికరణ మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ వనరుల సమీకరణ చేసుకోవడం జరిగింది.2014 నుండి తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రగతి పేరిట వివిధ దశలలో సమకూర్చిన 17.63  నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు మన తాండూర్ పట్టణం సుందరంగా మరియు పచ్చగా మారడానికి హరితహారం అనే మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.



రూ 33 లక్షలు వెచ్చించి నర్సరీలో పట్టణ ప్రకృతి వనాలు పార్కులు 4.7km ఎవెన్యూ,మీడియన్ మరియు MLAP ప్లాంటేషన్ చేపట్టి పట్టణాన్ని ఒక సుందర వనంగా మార్చుకోవడం జరిగింది అని తెలిపారు.పారిశుద్ధ్య నిర్వహణకుగాను వాహనాల సంఖ్య 18 నుండి 43 కి పెంచడం జరిగింది. దీనివల్ల తాండూర్ పట్టణంలో పరిశుభ్రత మెరుగుపడింది. అదేవిధంగా అంతారం యందు 5 ఏకరాలకు విస్తీర్ణంలో గల డంపింగ్ యార్డ్ నందు కంపోస్టు షెడ్యూల్ ఏర్పాటుతోపాటు పట్టణములో వచ్చు పొడిచెత్తను వేరుచేసి తద్వారా ఏరియాలో DRCC లను ఏర్పాటు చేయడం జరిగింది.

తాండూరు పట్టణంలో ప్రజా సౌకర్యర్థం రూ.56 లక్షలతో ప్రజా మరుగుదొడ్లను నిర్మించడం జరిగింది మరియు వాటిని నిత్యం శుభ్రపరిచే విధానం ని పర్యవేక్షించేందుకు ఒక IT వ్యవస్థ ను రూపొందించి  పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా సెప్టిక్ ట్యాంకుల నుండి సురక్షితంగా శుద్ధి చేయడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది అందులో భాగంగా మన పట్టణానికి రూ.100.00లక్షలతో FSTP నిర్మాణం చేపట్టింది.


వైకుంఠధామాల విషయానికొస్తే స్మశాన వాటికలో సరైన వసతులు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది, కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైకుంఠధామాలను అభివృద్ధి పరిచి, నిర్మించి సకల సౌకర్యాలు కల్పించడం జరిగింది. స్మశానంటే భయపడే స్థితి నుంచి పార్కుల్లో తిరిగినట్లుగా ఆలయాలకు వెళ్లినట్లుగా తీర్చిదిద్దిన ఘనత కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మాత్రమే దక్కుతుంది. అదేవిధంగా మన పట్టణంలో 2 వైకుంఠధామాలు రూ.200.00 లక్షలతో చేపట్టుటకు టెండర్  దశ పూర్తి కాబడింది, త్వరలో పనులు పూర్తి చేయబడును మరియు వైకుంఠ రథమును ఏర్పాటు చేయడం జరిగింది.

 ప్రజలకు కావలసిన కూరగాయలు మరియు నాన్ వెజ్ ఒకే చోట దొరికేలా చించోలి రోడ్డు యందు గల రైతుబజార్ యందు రూ.750.00 లక్షలు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ సకల సౌకర్యాలతో నిర్మించబడుచున్నది.గతంలో నీటి కోసం కొట్టిన చేతిలో ఇప్పుడు ఇంట్లోనే హాయిగా తాగునీటిని పట్టుకుంటున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనికత  వలన సాధ్యమైంది. మరియు నిరుపేదలకు ఒక్క రూపాయికే నల్ల కనెక్షన్ ఇచ్చి చరిత్ర సృష్టించింది, అదేవిధంగా మన పట్టణంలో 12623 కుటుంబాలకు నల్ల కలెక్షన్లతో సురక్షిత త్రాగునీరు లభించింది.


ఇందుకోసం పట్టణ పరిధిలో 107.02 కిలోమీటర్ల పైపులైను వేయడం జరిగింది. మరియు ఇంటింటికి నల్ల కలెక్షన్లు ఇవ్వడం జరిగింది.ఇవే కాకుండా మానసిక ఉల్లాస మరియు శారీరక దృఢత్వం కొరకు ఆదర్శంగా వన్ ఓపెన్ జిమ్ పార్క్ మరియు ఎన్టీఆర్ నగర్,ఆదర్శ్ నగర్ 2 వార్డుల యందు క్రీడ ప్రాంగణాలను అభివృద్ధి చేయడం మరియు వీటికి 10 లక్షల నిధులను వెచ్చించడం జరిగింది. పట్టణ ప్రజల చంద్ర టాకీస్ వెనుక గల కమ్యూనిటీ సెంటర్ నందు అర్బన్ పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్ మరియు పాత దండలు అంబేద్కర్ పార్కు దగ్గర బస్తీ దావాఖాన ఈ రెండింటికి 20 లక్షలు వెచ్చించి  ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది.

 పట్టణ ప్రగతిలో భాగంగా 3665 వీధి వ్యాపారుల కుటుంబాలను గుర్తించి వారి అభివృద్ధి నిమిత్తము రూ.45.80 లక్షలను వీది వ్యాపారులకు, పీఎం, స్వనిధి రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వడం జరిగింది, అలాగే వీధి వ్యాపారుల సముదాలను ఏర్పాటు చేయడం జరిగింది.రాష్ట్రంలో రూ 1.32 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ 14,403.72 కోట్ల రుణాలను మంజూరు చేయడం జరిగింది. అలాగే మన పట్టణంలో 2014 నుండి 1022 మహిళా స్వయం సంఘాలకు రూ.8458.10 లక్షల రుణాలను మంజూరు చేయడం జరిగింది.


తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలోని అత్యంత బలహీనవర్గాలను రక్షించడానికి పెరుగుతున్న వయసుతో, జీవనోపాధి కోల్పోయిన వారు గౌరవప్రదమైన మరియు సామాజిక పద్ధతితో కూడిన జీవితాన్ని గడపడానికి అవసరమైన వారి రోజువారి కనీస అవసరాలకు,ఆర్థిక మద్దతు ఇవ్వడానికి 2014లో ఆసరా పింఛన్లు మన పట్టణంలో 2014 సంవత్సరం నుండి 6156 పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది.తాండూరు పట్టణంలో మెరుగైన విద్యుత్ కాంతి కొరకు ప్రధాన రహదారులు మరియు వీధులలో 6400 LED లైటింగ్ ఏర్పాటు చేసి అభివృద్ధి అంటే ఇది అని చెప్పే ప్రయత్నం చేసింది మన తెలంగాణ ప్రభుత్వం. వివిధ స్కీముల ద్వారా 22 KM రోడ్లు మరియు 27KM డ్రైనేజీ నిర్మాణంచేపట్టడం జరిగింది. అలాగే మౌలిక వస్తువుల కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం TUFIDCని ఏర్పాటు చేసి 25.00 కోట్లను విడుదల చేసింది.

వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుంది ? క్లిక్ చేసి ఓటు వేయండి

అదేవిధంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా తాండూరు పట్టణానికి 2 మైనారిటీ, 2 BC 2 SC మరియు 1 ST గురుకుల పాఠశాలలను తీసుకురావడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా కాన్పు సమయంలో మహిళలు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది కానీ ఇప్పుడు మాత శిశు సంక్షేమ  హాస్పిటల్ ఏర్పాటు కావడం ద్వారా రాష్ట్రంలోనే ఎక్కువ కాన్పులు జరుగుతున్న ప్రదేశంగా మన తాండూరు ఉండడం జరిగింది.



మరియు రానున్న రోజుల్లో ఐటిఐ కాలేజ్ మరియు నర్సింగ్ కాలేజ్ మన తాండూరు పట్టణంలో ప్రారంభం చేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. రానున్న రోజుల్లో తాండూరు ని ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేని తాండూర్ గా మీరు చూస్తారని,  అదేవిధంగా ఈ తాండూరు పట్టణాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దుతానని మీ తాండూర్ బిడ్డగా మీకు చెప్తున్నాను.

అలాగే మీ యొక్క ఆశీర్వాదం నా మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్ గారు, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు గారు, మున్సిపల్ కమిషనర్ శంకర్ సింగ్ గారు, తాండూరు పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నయీమ్ అప్పుగారు, మున్సిపల్ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మెప్మా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, పలు సేవా సంస్థలు, మరియు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున పాల్కొన్నారు.

* దశాబ్ది ఉత్సవాల్లో పట్టణ ప్రగతి సంబరాలు ఇక్కడ క్లిక్ చేయండి 
* నేడు రేపు పలు ప్రాంతాల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇక్కడ క్లిక్ చేయండి 
* మూడో రోజూ బారాస ఎమ్మెల్యేల ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies