జీవన్గి గ్రామంలో భూనిర్వాసిత రైతులు ఆందోళన చెందొద్దు
* తాండూరు బిడ్డగా ఇది నా హామీ
* ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయాన్ని అందజేస్తాం
* దయచేసి అభివృద్ధిని అడ్డుకోకండి
* ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండలం జీవన్గి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు భూనిర్వాసిత రైతులు ఆందోళన చందొద్దని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ భూనిర్వాసిత రైతులు ప్రతిపక్షాల మాయలో పడి అపోహలకు గురికావద్దని, ఎట్టి పరిస్థితులను వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన పరిహారం అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.అతి త్వరలో ప్రభుత్వం నుండి వారికి సహాయం అందజేయడం జరుగుతుందని అప్పటి వరకు రోడ్డు పనులను అడ్డుకోవద్దని కోరారు. ఈ అప్రోచ్ రోడ్డు పూర్తయితే ఎంతోమంది ప్రజల రవాణా సౌకర్యానికి అనువుగా ఉంటుందని కావున రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. తాండూరు అభివృద్ధి నా బాధ్యత అని, తాండూరు ప్రజల క్షేమము, సుఖసంతోషాలే నా ఆకాంక్ష అని తెలిపారు.