బిసి వర్గం వాళ్లకు ఆర్థిక సహాయం
* రూ. లక్ష సాయం 15 కులాలకు
తెలంగాణ Telangana News : బీసీ వర్గాల్లోని కుల చేతి వృత్తిదారులు పనిముట్లు, వృత్తి పరికరాలు కొనుగోలు చేసు కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని (గ్రాంటు) తొలి విడతలో 15 కులాలకే అందించనున్నారు. బీసీ వర్గాల్లోని ఆ 15 కులాల వివరాలను బీసీ సం క్షేమ శాఖ బుధవారం విడుదల చేసింది. పూర్తిగా చేతి వృత్తిదారులకే ఈ ఆర్థిక సాయాన్ని అందించనుంది.
ఆర్థిక సహాయం కోసం తొలి విడతలో ఎంపిక చేసిన బీసీ కులాలు...!
1. నాయీ బ్రాహ్మణులు 2. రజక 3. సగర/ ఉప్పర 4. కుమ్మరి/శాలివాహన 5. అవుసల 6.కంసాలి 7. కమ్మరి 8. కంచరి 9. వడ్ల/వడ్ర /వడ్రంగి, శిల్పులు 10. కృష్ణ బలిజ పూసల 11. మేదర 12. వడ్డెర 13. ఆరె కటిక 14. మేర 15. ఎంబీసీలను రూ. లక్ష స్కీం వర్తించే బీసీ కులాలుగా పేర్కొన్నది. అలాగే కళ్యాణలక్ష్మి లబ్ధిదారులు కూడా ఈ పథకానికి అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.1 ఏప్రిల్ 2021 తరువాత పొందిన ఆదాయ ధ్రువీకరణ పత్రాల ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకో వచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆన్లైన్ కి కావాల్సిన పత్రాలు
1 ఆధార్ కార్డు
2 క్యాస్ట్ సర్టిఫికెట్ ( క్యాస్ట్ సర్టిఫికేట్ 2015 తర్వాత ఎప్పటిదైనా
3 ఇన్కమ్ సర్టిఫికెట్ ( కొత్తది 2023 లో తీసుకున్నది )
4 పాస్ ఫోటో 1
5 బ్యాంక్ అకౌంట్ నంబర్ మరియు %క్ష్మీమీజ% కోడ్ .
6 ఇంట్లో 18 సంవత్సరాలు మించినా వాళ్ళు ఎంత మంది ఉన్నారో వాళ్ళందరి పేర్లు మరియు ఆ కార్డు నంబర్.
7 పాన్ కార్డు ( తప్పనిసరి కాదు )
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం లోని కోప్రూరెట్ బ్యాంకు వాళ్లు చనిపోయిన మనుషుల పేరుమీద అన్యాయం గా డబ్బులు తీసుకొని వ్యాపారం చేస్తున్నారు అంటే చనిపోయిన వాళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు అని క్రెయేట్ చేస్తు వసూలు చేస్తున్నారు
ReplyDelete