Type Here to Get Search Results !

Sports Ad

హరితహారం తెలంగాణకు మణిహారం Haritaharam is Maniharam for Telangana


 హరితహారం తెలంగాణకు మణిహారం


* హరిత నిధి కేసిఆర్ లిఖించిన విధి
* తెలంగాణ పచ్చలహారం ప్రజలు మెచ్చిన హరితహారం
* నాడు పర్యావరణ విధ్వంసం నేడు పచ్చతోరణపు విలాసం
* పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ అగ్రపథం తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి 

పెద్దేముల్ భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని నాగులపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు తెలంగాణ కు హరితోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన తాండూర్ ఎమ్మెల్యే, పైలట్ రోహిత్ రెడ్డి గారు అదే విధంగా అక్కడ ఎర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణకు హరితహరం అనేది ప్రపంచంలోనే ఒక మహోత్తరమైన కార్యక్రమం అని, నేడు ప్రపంచం లోని అన్ని దేశాలు మన రాష్ట్రం వైపు చూస్తూ తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాయి అని దీనికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి గొప్ప విజయం  వల్లనే ఇంత అభివృద్ధి సాద్యం  అయిందని అందుకే ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలను రాష్ట్రం అంతా కూడ ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారని తెలియజేశారు

హరితహారం :

ఆకుపచ్చని తెలంగాణను ఆవిష్కరించడమే లక్ష్యంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు 3 జూలై 2015 న ప్రారంభించారు. భూమిపై పచ్చదనాన్ని పెంచేందుకు చైనా, బ్రెజిల్ తర్వాత జరుగుతున్న మూడవ మానవ మహా ప్రయత్నం ‘‘తెలంగాణకు హరితహారం’’

తెలంగాణలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో అమలు చేస్తున్నది.గత పదేళ్ళలో రూ. 10,822.46 కోట్ల వ్యయంతో  273.33 కోట్ల మొక్కలు నాటారు.హరితహారంతో తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ కలర్  7.7 శాతం  పెరిగినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2021 పేర్కొన్నది.దేశంలోనే తెలంగాణ హరిత నిధిని  ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఖ్యాతికెక్కింది. 2023 వర్షాకాలంలో 9వ విడత హరితహారం కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.ఈ విడతలో మొత్తం 19.29 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు.


లక్ష్యాన్ని దాటిన హరితహారం :

తెలంగాణకు హరితహారం లక్ష్యం 230 కోట్ల మొక్కలు నాటడం.మే 2023 నాటికి మొత్తం నాటిన మొక్కలు 273.33 కోట్లు, 2022 నాటికి హరితహారానికి చేసిన ఖర్చు రూ. 10,822.46 కోట్లు, తెలంగాణ విస్తీర్ణంలో అడవులు 24.06 ఉన్నాయి. చెట్ల సాంద్రత 2014లో 2,549 చ.కి.మీ. ఉండగా.. ప్రస్తుతం అది 2,848 చ.కి.మీలకు పెరిగింది.పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రముఖ సంస్థ సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) నివేదికలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది.ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వాళ్లు తెలంగాణ పొలిమేరల్లోకి రాగానే వర్ణశోభితమై కనువిందు చేస్తున్న చెట్లను చూసి పులకించి పోతున్నారు, ఇది మనకు గర్వకారణం.హరితహారం ఇచ్చిన సత్ఫలితాలతో మన హైదరాబాద్ నగరం ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా రెండుసార్లు గుర్తింపు పొందింది.రానున్న వర్షాకాలంలో హరితహారం కార్యక్రమంలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.

హరితనిధి ఒక నవీన ఆలోచన :

ప్రపంచంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో హరితనిధిని ఏర్పాటు చేసింది.ఇందులో, శాసనసభ, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్ధులు వీరందరిని హరితనిధిలో భాగస్వాములను చేసింది.విరి నుండి సమీకరించినమొత్తంతో హరిత నిధి ఏర్పాటు అయ్యింది.

అవార్డులు, ప్రశంసలు :

* తెలంగాణ ప్రభుత్వ హరిత ప్రయత్నాలకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు, అవార్డులు, ప్రశంసలు వరుసకట్టాయి.తెలంగాణ బృహత్‌ ప్రకృతి వనాలు దేశానికే ఆదర్శం అంటూ నీతి అయోగ్‌ ప్రత్యేక ప్రశంసలు ఇచ్చింది. భవిష్యత్తు తరాలకు పర్యావరణహిత రాష్ట్రాన్ని అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కారు పనిచేస్తుంది.హరితహారం ఒక పథకం కాదు ఇదొక పవిత్ర కార్యం. పర్యావరణాన్ని రక్షించేది. ప్రకృతిని కాపాడేది. భవిష్యత్ తరాలకు భద్రత కల్పించేది. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటింది.

         ఇదే స్ఫూర్తితో హరితహారం మరింత విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ కూడ ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో పాలుపంచుకొని విధిగా మొక్కను నాటవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నానను ఈ కార్యక్రమంలో డీఎస్పీ శేఖర్ గౌడ్ గారు,పోలీస్ అధికారులు మరియు  ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు,ఎంపీటీసీల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ చారి గారు,పెద్దేముల్ మండల ఎంపీపీ అనురాధ రమేష్ గారు,  మండల పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ గారు, వివిధ గ్రామాల సర్పంచు  శ్రీనివాస్ గారు,శంకర్ నాయక్ గారు, జయరాం నాయక్ గారు, పాండు నాయక్ గారు, ఇతర సర్పంచులు, ఎంపీటీసీలు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది.

మరిన్ని వార్తల కోసం........
* ఈ పథకంలో చేరితే రైతన్నలకు నెలకు రూ. 3వేల  పింఛన్‌ ఇక్కడ క్లిక్ చేయండి 
* ఆర్మూర్‌లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి 
* హరితహారం తెలంగాణకు మణిహారం ఇక్కడ క్లిక్ చేయండి 
* గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు 'పైలెట్' చేయూత ఇక్కడ క్లిక్ చేయండి  
* నేటి నుంచి పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు ఇక్కడ క్లిక్ చేయండి 
* మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత ఇక్కడ క్లిక్ చేయండి 
* బంగారం నగదు కోసమే "మర్డర్" ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies