హీరోయిన్,మంత్రి రోజాకు అస్వస్థత
చెన్నై Chennai News భారత్ ప్రతినిధి : పర్యాటకశాఖ మంత్రి ఆరె.కె.రోజా అస్వస్థతకు గురై చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చెన్నైలోని నివాసగృహంలో శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో గడిపిన రోజా ఉన్నట్టుండి కాలి వాపు, నొప్పితో బాధపడ్డారు. వెంటనే ఆమెను చికిత్స కోసం థౌజండ్ లైట్స్‌లో ఉన్న అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.చికిత్సతో కాలు వాపు తగ్గిందని, ఆమె పూర్తిగా కోలుకొని ఆదివారం సాయంత్రం లోపు డిశ్చార్జి అవుతారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.