కాబోయే ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అంటున్న ప్రజలు
* ఎవరు చేయలేని పని పైలట్ చేశారు
* ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేస్తున్నారు
* జీవన్గి బ్రిడ్జ్ నుండి కరణ్ కోట్ వరకు రోడ్డు
* ఎమ్మెల్యే గారికి గ్రామ ప్రజలు ధన్యవాదాలు
* ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో జీవన్గి బ్రిడ్జ్ నుండి కరణ్ కోట్ వరకు రోడ్డు పనులు దశాబ్దాల కళ నెరవేర్చిన తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.జీవన్గి బ్రిడ్జ్ నుండి కరణ్ కోట్ వరకు రోడ్డు ప్రజలకు తొందరలో అందుబాటులోకి రానుంది.ఇందులో భాగంగా సుమారు రెండు కిలోమీటర్ల వరకు మిగిలిన రోడ్డు పనుల భాగాన్ని సర్వే చేసి హద్దులు వేశారు.ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు ఇబ్బందిగా ఉన్నటువంటి ప్రధాన సమస్య బ్రిడ్జ్ రోడ్డు సమస్యని తీర్చడానికి పైలట్ సహకరించారు.దశాబ్దాలుగా ఏ నాయకుడు చేయనటువంటి ప్రధాన రోడ్డు సమస్యని ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
అలాగే జీవన్గి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు భూనిర్వాసిత రైతులకు అతి త్వరలో పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటానని అలాగే ఇట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిహారం అందేలా చూస్తానని తెలపడం జరిగింది.అలాగే గ్రామ ప్రజలు మాట్లాడుతూ యువ నాయకులు తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు తాండూర్ నియోజకవర్గ అభివృద్ధి తమ దేహంగా ముందుకు వెళ్తున్నారని అందుకు యావత్తు ప్రజానికం సంతోషంగా ఉందని రాబోయే రోజుల్లో రోహిత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే దిశగా సిద్ధంగా ఉన్నామని గ్రామ ప్రజలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి (రాజు పటేల్), నాయకులు మునీందర్ రెడ్డి, అంపిరెడ్డి, మాధవరెడ్డి, నర్సిరెడ్డి, భీమ్ రెడ్డి, వీరారెడ్డి, దస్తయ్య గౌడ్, ఎంపీటీసీ నర్సింలు, గ్రామ కమిటీ అధ్యక్షులు సోమిరెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సిరెడ్డి, కుర్వ రాములు, అనంతయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.