బహుజన్ సమాజ్ పార్టీలోకి యువత
* బహుజన్ సమాజ్ పార్టీ తాండూర్ నియోజకవర్గం
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : ఆదివారం రోజున ఉదయం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ యలాల్ గ్రామానికి వెళ్లడం జరిగింది.దానిలో భాగంగా బీఎస్పీ నాయకులకు యాలల్ గ్రామం యువత ఘనంగా స్వాగతం పలికారు.అదేవిధంగా ఆ గ్రామ యువతకు బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాలను మరియు పార్టీ యొక్క ఆవశ్యకతను,అధికారంలోకి వస్తే పేదలకు చేసే గొప్ప పనులను, బహుజన రాజ్యం వస్తే బహుజనల బ్రతుకులు ఏ విధంగా ఉంటాయో,ఆ యాలాల్ గ్రామ యువకులకు చంద్రశేఖర్ ముదిరాజ్ గారు తాండూర్ అసెంబ్లీ అధ్యక్షులు P.అరుణ్ రాజ్ గారు క్లుప్తంగా వివరించి, బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదగా బహుజన్ సమాజ్ పార్టీ కండువాను కప్పి గ్రామ యువతను పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ యాలాల్ మండల అధ్యక్షుడు M.కృష్ణ పెద్దేముల్ మండల అధ్యక్షులు శాఖమోల రమేష్, పార్టీ నాయకులు అశోక్ సాయి, ఇంటేనుక రవి, తదితరులు పాల్గొన్నారు.