నాడు పోరాటాలకు పుట్టినిల్లు తెలంగాణ
* తెలంగాణ రాష్ట్ర జాతి ఖ్యాతికీ ప్రతిరూపం రాష్ట్ర అవతరణ దినోత్సవం
* ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో రైతు స్కీములు
* ఎమ్మెల్యే శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తాండూర్ పట్టణంలో నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారు జాతీయ జెండా ఆవిష్కరించారు.అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆవిష్కరించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి 2 కోట్ల
అనంతరం ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ మరియు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాడు పోరాటాలకు పుట్టినిల్లు అయినా మన రాష్ట్రానికి నాడు ఉద్యమ కెరటంలా కేసిఆర్ గారు ముందుండి నడిపించి నాడు అభివృద్ధికి నోచుకోని మన తెలంగాణ నేడు ప్రగతి ప్రస్థానంలో దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రెండు కోట్ల రూపాయలతో తాండూర్ పట్టణంలో నిర్మాణం కానున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి భూమి పూజ చేయడం జరిగింది.
హాజరైన ప్రజలు విద్యార్థులు,ప్రజాప్రతినిధులు
దేశ భవిష్యత్తులో దేశ చరిత్రలో మరో నూతన అధ్యాయం జూన్ 02 తేదీ ఎన్నో ఆశలు ఎన్నో ఆకాంక్షలు ఎన్నో అవమానాలు,ఎన్నో పోరాటాలు కోట్లాది ప్రజల కోరిక నెరవేరిన తరుణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాదించుకున్నాక దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం 10 సంవత్సరంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నాయకత్వంలో అభివృద్ధిలో దేశంలోని మొదటి స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్ గారిది అని రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు గుర్తుచేసుకున్నారు.దేశ భక్తి పాటలతో నృతలతో అంగరంగ వైబోవంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు మున్సిపల్ ప్రజాప్రతినిధులు, పలు విభాగాల నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.