Type Here to Get Search Results !

Sports Ad

నాడు తండాలు..నేడు పంచాయతీలు in tandur

 



నాడు తండాలు..నేడు పంచాయతీలు


* గిరిజన తండాల్లో సిఎం కేసిఆర్ కు జేజేలు
* చీకటి తండాల్లో వెలుగుల సూర్యుడు
* గిరిజన గూడాల్లో అపరభగీరథుడు
* అంధకారం నుంచి అంబేద్కర్ ఓవర్సీస్ విదేశీ విద్య వరకు
* గిరిజనుల ప్రస్థానం తెలంగాణ సర్కారుతోనే సాధ్యం
* దశాబ్ది ఉత్సవాల వేళ అంబరాన్ని తాకేలా గిరిజనోత్సవం
* ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి 


 తాండూర్ Tandur News : ‘మావ నాటే మావ రాజ్’ మా తండాల్లో మా రాజ్యం అన్న గిరిజనుల సుదీర్ఘ కాల డిమాండ్ ను నెరవేర్చిన గిరిజన సూర్యుడు సిఎం కేసిఆర్ తండాలను గ్రామ పంచాయతీలు చేసి, వాటికి గిరిజనులనే పాలించుకునేలా సర్పంచ్ లు చేసి, పంచాయతీలను ప్రగతి కేంద్రాలు చేసి, గిరిజన సంక్షేమానికి గీటురాయిగా మారిన ప్రభుత్వం ఇది. ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే ఏళ్ల తరబడి కొనసాగుతున్న గిరిజనులు గోడు అయిన పోడు భూములు పంచి, వారికి రైతుబంధు ఇచ్చే గిరిజన నేస్తం ఈ ప్రభుత్వం. గిరిజనుల సమ్మక్క – సారలమ్మ జాతరకు ప్రతిసారి 100 కోట్లు ఖర్చు చేసి ఘనంగా నిర్వహిస్తున్న ఆదివాసీ ప్రభుత్వం, గిరిజన పండుగలకు వైభవం కల్పించిన సమర్థ నాయకత్వంలో దశాబ్ది ఉత్సవం చేసుకుంటున్న సందర్భం ఇది. గిరిజనుల ఆత్మగౌరవ ఆనందోత్సవం ఇది.

ఎస్టీ సంక్షేమం :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన వినూత్న పథకాలతో నేడు స్వరాష్ట్రంలో గిరిజనులు ఆత్మగౌరవంతో, భవిష్యత్ మీద భరోసాతో ఉన్నారు.ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి దార్శనికతతో నేడు గిరిజనుల్లోని అనేక తెగలు విద్యాధికులుగా, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా, రాజకీయాల్లో రాణిస్తూ అభివృద్ధి బాటలో పయనిస్తున్నారు.యావత్ దేశంలోనే నేడు తెలంగాణలో గిరిజనుల సంక్షేమం ఆదర్శప్రాయంగా పరిఢవిల్లుతోంది. 

ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టం (సబ్ ప్లాన్) :
అడవులు, కొండలు, గుట్టల్లో జీవించే గిరిజనులను జన జీవన స్రవంతికి దగ్గరగా తీసుకురావాలనే రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఎస్టీల కోసం ప్రత్యేక ప్రగతి నిధి చట్టం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఎస్టీల కోసం ఖచ్చితంగా జనాభాకనుగుణంగా నిధులను కేటాయించాలనే నిబంధనను పటిష్టంగా అమలు చేస్తున్నది.ఎస్టీ సబ్ ప్లాన్ కింద రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్ళలో రూ. 43,936.32 కోట్లను ఖర్చు చేసింది. 
ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు అండగా ‘టీఎస్ – ప్రైడ్’ :
ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం టి- ప్రైడ్ పథకాన్ని అమలులోకి తెచ్చింది.ఇందులో భాగంగా 13,264 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వారు ప్రారంభించిన వ్యాపారాల్లో పలు ప్రోత్సాహకాలను అందించింది.అందుకోసం రూ.639.24 కోట్లను ఖర్చు చేసింది.

ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ :
గిరిజనుల గృహావసరాలకోసం 101 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ను అందిస్తోంది.ఈ విధానం ద్వారా 1,00,942 ఎస్టీ గృహాలకు ఉచిత విద్యుత్ అందుతున్నది.ఇందుకోసం 2014 నుంచి మే 2023 వరకు రూ.192 కోట్లను ఖర్చు చేసింది.అదే సందర్భంలో రూ.221 కోట్లను ఖర్చు చేసి 3,467 గిరిజన ఆవాసాల్లో విద్యుత్ వాడకం కోసం, మోటార్లు మిల్లులు తదితర నిత్యావసరాల కోసం 3 ఫేస్ కరెంటు సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.



గిరిజనులకు ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాలు :
రాష్ట్రంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కేంద్రాలు, ఐటిడిఎ ప్రధాన కేంద్రాలు, గిరిజన జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గిరిజన భవనాలు నిర్మిస్తోంది.ఒక్కో భవనానికి కోటి రూపాయలు చొప్పున వెచ్చింది, 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మాణం చేస్తోంది.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 82 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ. 21.50 కోట్లతో కుమరం భీమ్ ఆదివాసీ భవన్ ను నిర్మించి, ప్రారంభించింది.61,544 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 21.71 కోట్లతో సేవాలాల్ బంజారా భవన్ ను కూడా పూర్తి చేసి, ప్రారంభోత్సవం చేసింది.ఈ భవనాల్లో గిరిజన, ఆదివాసీ సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి వినియోగించుకోవడం జరుగుతోంది.

అధికారికంగా ఆదివాసీ పండుగలు :
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ఇనుమడింపజేసేందుకు వారి పండుగలైన సంత్ సేవాలాల్ జయంతి, కుమరంభీం జయంతి, వర్ధంతులు, బౌరాపూర్ జాతర, జంగుబాయి జాతర, నాచారం జాతరలకు ప్రభుత్వం ప్రతిఏటా నిధులు విడుదల చేస్తూ, అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నది.ప్రభుత్వం రెండేళ్ళకోసారి వచ్చే మేడారం జాతర కోసం ప్రతీ ఏటా దాదాపు రూ.100  కోట్లను విడుదల  చేస్తున్నది.గిరిజన పండగలకు దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తోంది.దేశ, విదేశాలనుంచి గిరిజన జాతరలకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తోంది.శిథిలావస్థలో ఉన్న గిరిజన, ఆదివాసీ ఆలయాలను పున: నిర్మాణం చేసి కొత్త శోభను అందించింది.

ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు :
జనాభా దామాషా ప్రకారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అందించిన రాజ్యాంగం హక్కులను అమలు చేయాలనే ధృఢ సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు.ఎస్టీలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో ప్రస్తుతం అమలవుతున్న 6 శాతం రిజర్వేషన్ ను 10 శాతానికి పెంచి దేశానికే ఆదర్శంగా నిలిచింది.

గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలు :
స్వతంత్ర భారత చరిత్రలో గిరిజన రాజకీయ సాధికారతా దిశగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నది.‘మా తండాలో మా రాజ్యం’ అనే గిరిజనుల చిరకాల ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చింది.500 జనాభాను మించి వున్న 2,471 తండాలు, గూడాలను., నూతనంగా గ్రామ పంచాయతీలుగా మార్చింది.గతంలోని 675 కలుపుకొని మొత్తం 3,146 తండాలు, గూడాలు గ్రామ పంచాయతీలుగా అవతరించాయి.ఈ గ్రామ పంచాయతీల్లో వేలాది మంది ఆదివాసీ, లంబాడీ, గిరిజన యువతీ యువకులను సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, రాజకీయ అధికారంలో భాగస్వాములను చేసిన ఘనత సిఎం కేసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వానిదే. 

ఎస్టీలకు విద్య :
ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు(గురుకులాలు) రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉన్న 91 ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలుండగా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్వల్పకాలంలోనే మరో 92 గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసింది. మొత్తం ఎస్టీ గురుకుల పాఠశాలల సంఖ్య 183 కి చేరుకుంది.ఈ గురుకులాల్లో మొత్తం 3,520 మంది టీచర్లు పనిచేస్తుండగా, 66,168 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.


ఎస్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు :
రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం 30 ఎస్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలుండగా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్వల్పకాలంలోనే మరో 88 కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఎస్టీ జూనియర్ కాలేజీల సంఖ్య తెలంగాణలో 118 కి చేరుకున్నది. ఈ గురుకుల కాలేజీల్లో 1064 మంది టీచర్ల పనిచేస్తుండగా, మొత్తం విద్యార్థుల సంఖ్య 23,840.

ఎస్టీ డిగ్రీ కాలేజీలు :
రాష్ట్ర ఏర్పాటుకు ముందు నాటి తెలంగాణ ప్రాంతంలో ఎస్టీలకు ఒక్క డిగ్రీ కాలేజీ లేదు.రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం 22 ఎస్టీ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది.వీటిలో మొత్తం 946 అధ్యాపకులు విధులు నిర్వరిస్తుండగా 14,020 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.   

గుడుంబా రద్దు :

గిరిజన తండాల్లో గుడుంబా అనేక కుటుంబాలను చిధ్రం చేసింది.గుడుంబా వల్ల 80 శాతం మంది వితంతువులే కావడం తెలుసుకొని కలత చెందిన కేసీఆర్ గుడుంబాను శాశ్వతంగా రద్దు చేశారు.గత పాలనలో గిరిజనులు, ఆదివాసీలను ఓటుబ్యాంకుగా మాత్రమే చూసి, వారి సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆమడదూరంలో ఉంచితే...తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, సిఎం కేసిఆర్ నాయకత్వంలో గిరిజన తండాలు, చెంచుల పెంటలు, ఆదివాసీ గూడాల రూపురేఖలు మారాయి. సంక్షేమం, అభివృద్ధి పథకాలతో వికసించాయి.


                 కొండలు, గుట్టల్లో జనజీవనానికి దూరంగా ఉన్న అడవి బిడ్డలను అంధకారం నుంచి వెలుగుల్లోకి తీసుకొచ్చిన పదేండ్ల పాలన గిరిజనుల పాలిట పండుగ అని ఈ సందర్బంగా మాట్లాడటం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత మొగులప్ప గారు, మండల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ గారు, మండల ఎంపిటిసి పురం అధ్యక్షులు దన్సింగ్ గారు, సీనియర్ నాయకులు రమేష్ గారు, మన్సాన్పల్లి రవి, సర్పంచులు శ్రావణ్ కుమార్, పాండు, మోహన్ రెడ్డి, నాయకులు నాగేందర్, యేసు మరియు ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

* రెండో దఫా గొర్రెల పంపిణీ ఇక్కడ క్లిక్ చేయండి 

* నాడు తండాలు..నేడు పంచాయతీలు ఇక్కడ క్లిక్ చేయండి

* బషీరాబాద్ డిప్యూటీ తహసీల్దార్ బదిలీ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies