Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి Minister Sabitha Indra Reddy congratulated Telangana State on its Independence Day


 తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి 


తెలంగాణ Telanagana News : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలుపెరుగని పోరాటాలు, అనేక త్యాగాల ఫలితంగా ఆరు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానంతో సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ద్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. ఇంటింటికి రక్షిత మంచినీరు, సాగు జలాలు, సేద్యానికి 24 గంటల విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు వంటి అనేక సంక్షేమాభివృద్ది కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పల్లె, పట్టణ ప్రగతితో గ్రామ గ్రామాన పరిశుభ్రత, పచ్చదనం వెల్లివిరుస్తూ వరుసగా జాతీయ అవార్డులు వరిస్తుండడం తెలంగాణ ప్రగతికి ప్రామాణికంగా నిలుస్తోందన్నారు.

     గడిచిన తొమ్మిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే అనితర సాధ్యమైన అభివృద్ధి, సంక్షేమాన్ని ఆచరణాత్మకంగా నిరూపించిన తెలంగాణ ప్రభుత్వం, ఇదే స్ఫూర్తితో మరింత సమర్ధవంతమైన పాలన దిశగా ముందుకు వెళ్లాలనే సంకల్పంతో దశాబ్ది ఉత్సవాలను చేపడుతోందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం స్ఫూర్తితో రాష్ట్ర ప్రగతిలో సబ్బండ వర్ణాలు మమేకమవుతూ, దశాబ్ది ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం..... 
* ఎంపీటీసీ రేఖ పవన్ ఠాకూర్ గారి నూతన గృహ ప్రవేశం ఇక్కడ క్లిక్ చేయండి 
* బషీరాబాద్ లో పట్నం మహేందర్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ క్లిక్ చేయండి 
* తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies