అతి రుద్ర మహాయాగానికి అధికారులకు ఆహ్వానించిన ఎమ్మెల్యే
* జులై 3 నుండి 13 వ తారీఖు వరకు
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తాండూర్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం,మంచి వర్షాలు కురవాలని, గ్రామాలంతా పచ్చగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని జులై 3 నుండి 13 వ తారీఖు వరకు నిర్వహిస్తున్న శ్రీ రాజశ్యామల, శత చండీ సౌర, లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగానికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రువర్యులు సబితా ఇంద్రారెడ్డి,చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి,చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి,వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ సునీత రెడ్డి,ఎమ్మెల్సీ సురభి వాణి దేవి గారికి తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆహ్వాన పత్రిక అందజేశారు.కాబట్టి ఈ యొక్క మహాయాగంలో పుణ్య దంపతులు మరియు భక్తులందరూ భాగస్వామ్యం అయి యాగఫలం పొంది అనేక ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కోరారు.