కేజిబివి నాన్ టీచింగ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలి
* విద్యాశాఖ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన కేజీబీవీ వర్కర్లు.
హైదరాబాద్ HYderabad News భారత్ ప్రతినిధి : కేజిబివి నాన్ టీచింగ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ హైదరాబాద్ ఎస్పిడి ఆఫీసు ఎదుట తెలంగాణ ప్రగతిశీల కేజీబివి నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ (IFTU) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి అనంతరం విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ASPD రమేష్ గార్కి సమర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల కేజిబివి నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్(IFTU) తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంటా నాగయ్య ,వై.గీత లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 476 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయని వీటిలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేదని, పని గంటల భారం ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వర్కర్లను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి, మొన్న కొత్త సచివాలయం ప్రారంభోత్సవ సందర్భంగా ప్రకటించిన పర్మినెంట్ జాబితాలో కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లు లేకపోవడం తీవ్ర అన్యాయమని అన్నారు. కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న వర్కర్లు కుటుంబాలకు దూరంగా అనేక కష్టనష్టాలను ఎదుర్కొని విధులు నిర్వహిస్తున్నారని అయినా వారికి ప్రభుత్వం నుండి ఎలాంటి సదుపాయాలు అందడం లేదని అన్నారు.తక్షణమే కేజీబీవీలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లను అందరిని రెగ్యులరైజేషన్ చేయాలని, కనీస వేతనం 27000/- రూపాయలు అందించాలని, వీక్లీ ఆఫ్ లు అమలు చేస్తూ పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్కొన్నారు.