Type Here to Get Search Results !

Sports Ad

గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు 'పైలెట్' చేయూత 'Pilot' for poor students of rural areas


 గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు 'పైలెట్' చేయూత 


* గ్రామీణ విద్యార్థులకు 'పైలెట్' చేయూత బస్ పాస్ సర్వీసు ఛార్జీ చెల్లింపుకు నిర్ణయం
* తాండూరులో 10 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం
* ఆర్టీసీకి రూ.5 లక్షల నగదు చెల్లింపు
* రోహిత్ రెడ్డి నిర్ణయంపై తల్లిదండ్రులు,విద్యావేత్తల హర్షం

తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు చేయూతను అందించేందుకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముందుకొచ్చారు. ఇప్పటికే సొంత డబ్బులతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న పైలెట్ రోహిత్ రెడ్డి ఈసారి గ్రామీణ విద్యార్థులకు సహాయం అందించాలని నిర్ణయించారు.ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేందుకు ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత బస్ పాసులను జారీ 2 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బాస్ పాస్ లను జారీ చేసేందుకు ఆర్టీసీ ప్రతి విద్యార్థి నుంచి రూ.50 సర్వీసు ఛార్జీ రూపంలో వసూలు చేస్తోంది. ఈ మొత్తంను విద్యార్థుల తరపున ఆర్టీసీకి చెల్లించేందుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముందుకొచ్చారు. తాండూరు బస్ డిపో పరిధిలో మొత్తం 10 వేల మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రతిఏటా ఉచిత బస్ పాస్ లను తీసుకుంటున్నారు. వీరు చెల్లించాల్సిన రూ.5 లక్షల డబ్బును చెల్లించేందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముందుకు రావడంతో పాటు ఈ మొత్తంను తాండూరు డిపో మేనేజర్ సమతకు అందించారు.

 ఉచిత బస్ పాస్ లు తీసుకునే విద్యార్థుల నుంచి ఎలాంటి సర్వీసు ఛార్జీలను వసూలు చేయవద్దు అని ఆర్టీసీ డిపో మేనేజర్ కు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సూచించారు. ఒకేసారి 10 వేల మంది గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంపై వారి తల్లిదండ్రులు, విద్యావేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 గ్రామీణ విద్యార్థులు ఉచిత బస్ పాస్ లు  పొందడానికి చెల్లించాల్సిన సర్వీసు ఛార్జీని చెల్లించడంతో పాటు బస్ పాస్ లను భద్రంగా ఉంచుకునేందుకు ప్రతి విద్యార్థికి ఒక పర్సును కూడా అందజేయాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిర్ణయించారు. ఉచిత బస్ పాస్ లు తీసుకునే  గ్రామీణ విద్యార్థుల తరపున సర్వీసు ఛార్జీలను చెల్లించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తాండూరు డిపో మేనేజర్ సమత కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో ఉచిత బస్ పాస్ లను గ్రామీణ విద్యార్థులకు జారీ చేస్తామని ఆమె వెల్లడించారు.

మరిన్ని వార్తల కోసం........
* ఈ పథకంలో చేరితే రైతన్నలకు నెలకు రూ. 3వేల  పింఛన్‌ ఇక్కడ క్లిక్ చేయండి 
* ఆర్మూర్‌లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి 
* హరితహారం తెలంగాణకు మణిహారం ఇక్కడ క్లిక్ చేయండి 
* గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు 'పైలెట్' చేయూత ఇక్కడ క్లిక్ చేయండి  
* నేటి నుంచి పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు ఇక్కడ క్లిక్ చేయండి 
* మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత ఇక్కడ క్లిక్ చేయండి 
* బంగారం నగదు కోసమే "మర్డర్" ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies