"రైతే రాజు" పండుగల ముస్తాబైన రైతు దినోత్సవం
* ఘనంగా రెండవ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు
* రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది
* తెలంగాణలో వ్యవసాయం అంటే ఒక పండుగ
* రైతులను భాగస్వాములను చేయాలి
* ఘనంగా రైతు వేదికలో రైతు సంబరాలు
తాండూర్/బషీరాబాద్ Tandur/Basheerabad News : తాండూర్ నియోజకవర్గం చెంగోలు,ఐనెల్లి గ్రామంలో రైతు దినోత్సవ కార్యక్రమం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు.పండుగల సాగిన రైతు దినోత్సవ కార్యక్రమాలు మరియు రైతు దినోత్సవ సందర్బంగా కొలహాలంగా మారిన గ్రామాలు ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తెస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.
నేడు తెలంగాణాలో రైతే రాజుగా ఉన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు తెలంగాణలో నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్టం తెలంగాణ రాష్టం.నేడు దేశానికి అన్నం పెడుతున్న అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది.కర్ణాటక రైతులు కూడా మేము తెలంగాణ వస్తాం అనే పరిస్థితులు వచ్చినాయి.నేడు దేశంలో రైతులంతా తెలంగాణ దిక్కు చూస్తుంది.ఒకనాడు పెరుగు అన్నంలో పురుగుల మందు తిని ఆత్మహత్యలు చేసుకున్నారు.నాడు బోర్లు దగ్గర రాత్రి పూట కరెంట్ షాక్ తో చచ్చిపోయిన సందర్భాలు మన తాండూర్ లో ఉన్నాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ లో వ్యవసాయం దండగ అన్నారు కానీ నేడు తెలంగాణలో వ్యవసాయం అంటే ఒక పండుగ.తెలంగాణలో మన ముఖ్యమంత్రి ఒక పేద రైతుగా అలోచించి రైతును రాజును చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిది అని తెలిపారు.
బషీరాబాద్ మండలంలో తెలంగాణ రైతు దినోత్సవం ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.మండలంలోని ప్రతి గ్రామాలలో ఇస్మాయిల్ పూర్, ఎక్మయి,నవల్గా, కాశింపూర్, మంతటి, రైతు వేదికల దగ్గర శనివారం రోజు గ్రామ గ్రామము నుండి ఆనందోస్తాలతో విచ్చేసిన అన్నదాతలు ట్రాక్టర్ పై రైతులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లకు మామిడి తోరణాలతో కట్టుకొని రైతు వేదికల దగ్గరికి చేరుకున్నారు.ఎక్మయి సర్పంచ్ నారాయణ,ఎంపిటిసి మరియు సీనియర్ నాయకుడు రాజు పటేల్ గ్రామస్థులు ఘనంగా జరుపుకున్నారు.ఈ సంధర్బంగా నాయకులు మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నముక్క లాంటివారు.రైతు రాజు అని రైతులు సంతోషంగా ఉంటె రాష్ట్రము సంతోషంగా ఉంటుందని సీఎం కెసిఆర్ గారు రైతు పథకాలను అమలు చేశారని తెలిపారు.
రైతులకు 24 గంటలు కరెంటు ఇవ్వడము రైతుబంధు పథకాన్ని 2018 లోనే ప్రారంభించడం జరిగింది. ఈ పథకము ప్రవేశపెట్టి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం 9 ఏళ్లలో వ్యవసాయ యంత్రాల కోసము రూ. 6లక్షల 70 వేల మందికి రైతులకు ప్రయోజనం కల్పించడం జరిగింది. ప్రపంచ చరిత్రలో మన తెలంగాణ రైతన్నకు మరింత గుర్తింపు రావాలని కోరినారు. గత ప్రభుత్వం పెంచిన విషయానికి వస్తే మన ప్రభుత్వము మేలు షాదీ ముబారక్ కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ రైతు బీమా రైతు బంధు కేసీఆర్ కిట్టు ఒంటరి మహిళలను బీడీ కార్మికులను ప్రతి ఒక్కరిని గుర్తించింది.తెలంగాణ ప్రభుత్వమే అని గట్టిగా చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ అన్నపూర్ణ, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, స్థానిక సర్పంచ్ ప్రియాంక, తాసిల్దార్ వెంకటస్వామి, ఏవో సూర్య ప్రకాష్,సూపరైంట్ విజయ్ కుమార్, పవన్ కుమార్, రైతు అధ్యక్షులు రవి ప్రసాద్, పలు గ్రామా సర్పంచులు,ఎంపీటీసీలు, రైతులు సమన్వయ కమిటీ అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సిరెడ్డి, రాము నాయక్, పవన్ ఠాగూర్, శ్రవణ్ కుమార్, అంగన్వాడి టీచర్లు, పంచాయతీ సెక్రెటరీ,ఎక్మయి సర్పంచ్ నారాయణ,సీనియర్ నాయకుడు రాజు పటేల్, రాజు,బాయికాడి శ్రీను,ఎక్మయి రోహిత్ అన్న యుసేన అధ్యక్షుడు విజయ్ కుమార్,మాజీ ఎంపిటిసి కాశప్ప,రాములు నాయక్,ఇస్మాయిల్ పూర్ కార్యదర్శి గీత తదితరులు పాల్కొన్నారు.