రెండో దఫా గొర్రెల పంపిణీ
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తాండూర్ పట్టణంలో మల్కాపూర్ గ్రామానికి చెందిన 18 మంది అర్హులకు 18 యూనిట్లు అనగా 360 గొర్రెలు 18 పొట్టేలులను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు అందజేసారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమ,వర్గాలు తమ సాంప్రదాయ వృత్తులలో సాధికారత సాధించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతమవుతుందన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారైన కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని తాండూర్ నియోజకవర్గంలోని అర్హులైన గొల్ల,కురుమ కులస్తులందరూ వినియోగించవలసిందిగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ , మార్కెట్ కమిటీ అధ్యక్షులు విట్టల్ నాయక్, తాండూర్ మండల అధ్యక్షులు రాందాస్ ముదిరాజ్, తాండూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రాములు,సీనియర్ నాయకులు రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆశాన్న,డాక్టర్లు సదానందం, నిజానంద్, శ్రీకాంత్ రెడ్డి,హాథిరామ్,వెంకట్ రాజు ,మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు,కురుమ సంఘం సభ్యులు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.