రోహితన్నకు పాలాభిషేకం చేస్తున్న విద్యార్థులు
* గ్రామీణ విద్యార్థులకు 'పైలెట్' చేయూత,
* బస్ పాస్ సర్వీసు ఛార్జీ చెల్లింపుకు నిర్ణయం..
* తాండూరులో 10 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం..
* ఆర్టీసీకి రూ.5 లక్షల నగదు చెల్లింపు
* రోహిత్ రెడ్డి నిర్ణయంపై తల్లిదండ్రులు హర్షం BRSV.
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తాండూర్ పట్టణంలో పదివేల మంది విద్యార్థులకు ఉచితంగా బస్సు పాస్ సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తాండూర్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమం బి ఆర్ఎస్వి తాండూర్ ఇంచార్జ్ జిలాని తాండూర్ నియోజకవర్గ అధ్యక్షులు ఎబినేజర్ టౌన్ ప్రెసిడెంట్ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్ పాస్ లను జారీ చేసేందుకు ఆర్టీసీ ప్రతి విద్యార్థి నుంచి రూ.50 సర్వీసు ఛార్జీ రూపంలో వసూలు చేస్తోంది. ఈ మొత్తంను విద్యార్థుల తరపున ఆర్టీసీకి చెల్లించేందుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముందుకొచ్చారు. తాండూరు బస్ డిపో పరిధిలో మొత్తం 10 వేల మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రతిఏటా ఉచిత బస్ పాస్ లను తీసుకుంటున్నారు. వీరు చెల్లించాల్సిన రూ.5 లక్షల డబ్బును ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు చెల్లించినందుకు విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు విద్యార్థులందరూ ఎమ్మెల్యే గారికి అండగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు వడిచెర్ల పరమేష్ బి ఆర్ఎస్ యువ నాయకులు రజాకా నరసింహ టౌన్ వైస్ ప్రెసిడెంట్ ఆ కీప్ జనరల్ సెక్రెటరీ షోయబ్ జాయింట్ సెక్రెటరీ నాసిర్ ఖాన్ పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.