గ్రామ కమిటీలు ఏర్పాటు చేసిన నాయకులు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో పలు గ్రామంలో కమిటీలు ఏర్పాట్లు రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఐ లమల్లు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది.మండలంలోని వివిధ గ్రామాలలో నవల్గా,క్యాదిగిరా బషీరాబాద్ లో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామ యూత్ అధ్యక్షులను,ఉప అధ్యక్షులను,ప్రచార కార్యదర్శులను,కార్మిక విభాగం అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది.ఈ సంధర్బంగా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఐ లమల్లు ఆదేశాల మేరకు వచ్చే నేల 3 తేదీన గ్రామ కమిటీల ఏర్పాటు చేసిన అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ,మండల యూత్ అధ్యక్షులు జగదీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు,వడ్డెర సంఘం సీనియర్ నాయకులు,రాములు,అర్జున్,శ్రీను,వెంకటి నారాయణ,లక్ష్మయ్య,వెంకటి,ప్రకాష్,రమేష్, యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.