కరెంట్ ఇబ్బందులు లేని రాష్ట్రం మనది
* తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్
* విద్యుత్ ప్రగతి కార్యక్రమం
* ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తాండూర్ పట్టణంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల భాగంగా నాలుగవ రోజు విద్యుత్ ప్రగతి కార్యక్రమం తాండూర్ పట్టణం మెట్రో ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి MLA Pilot Rohith Reddy హాజరయ్యారు.ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడే నాటికి పగటిపూట మూడు గంటలు రాత్రిపూట మూడు గంటలు విద్యుత్ ను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల నుండి నేడు 24 గంటల ఉచిత విద్యుత్ పొందేలా ఘనత సాధించిన ఏకైక ప్రభుత్వం నా తెలంగాణా రాష్ట్ర భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం వృత్తినే ఉపాధిగా చేసుకొని జీవనం కొనసాగిస్తున్న వారికి ప్రతినెల 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది.