Type Here to Get Search Results !

Sports Ad

మహిళలు తల్లి బిడ్డల సంక్షేమమే ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం Welfare of women, mothers and children is the first duty of the government

 


మహిళలు తల్లి బిడ్డల సంక్షేమమే ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం

* మహిళలకు అండగా తెలంగాణ ప్రభుత్వం మాత్రమే
* మహిళ శిశు సంక్షేమానికి సంబంధించి 
* దేశంలోనే విప్లవాత్మక పథకాలు 
* ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి

తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తాండూర్ పట్టణంలోనే తులసి గార్డెన్స్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలులో భాగంగా మంగళవారం రోజున తులసి గార్డెన్స్ లో నిర్వహించిన తెలంగాణ మహిళా సంక్షేమ సంబురాల కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్కొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య లక్ష్మి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు గర్భిణులు, బాలింతలకు ఒక పూట భోజన పథకం 56% అంగన్వాడి కేంద్రాల్లో మాత్రమే అమలు చేయబడుతుండేది మరియు 25 రోజులు మాత్రమే పాలు, గుడ్లు పంపిణీ చేసేవారు, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి  రాష్ట్రంలో ఉన్న అన్ని అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు బాలింతలకు ప్రతిరోజు పప్పు ఆకుకూరలు గుడ్డు పాలతో ఒక పూట సంపూర్ణ భోజనం మరియు ఐరన్ ఫోలిక్ ఆసిడ్, కాల్షియం మాత్రల పంపిణీ, ఆరోగ్య తనిఖీలు గర్భిణీల బరువు పర్యవేక్షణ, ఇంటింటికి అంగన్వాడీ కౌన్సిలింగ్ లాంటి సేవలను ప్రారంభించడం జరిగింది.3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ప్రతిరోజు గుడ్డు వేడిగా మధ్యాహ్నం భోజనం మరియు స్నాక్స్, 7 నెలలనుండి 3 సంవత్సరాల వయసు పిల్లలకు బలవర్ధకమైన బాలమృతం మరియు గుడ్డు.45 బియ్యం అగ్మార్క్ నాణ్యత ప్రమాణం ఉన్న గుడ్డు విటమిన్ ఏ డి తో కూడిన నాణ్యమైన ఫోర్టిఫైడ్ పాలు వంటి నాణ్యమైన ఆహార పదార్థాలను ఇవ్వడం జరుగుతుంది.

 

 ప్రీ స్కూల్ విద్య,అంగన్ వాడి కేంద్రాల సిబ్బంది గౌరవ వేతనం 

రాష్ట్రంలో ప్రతి సంవత్సరం దాదాపు 6 లక్షల మంది పిల్లలకు ప్రీస్కూల్ విద్య అందించడం జరుగుతుంది. దేశంలో అత్యున్నత ప్రీ స్కూల్ విద్యా కార్యక్రమంలో ప్రణాళికను రూపొందించుకున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది.అంగన్వాడి టీచర్లు,పిల్లలు మరియు కుటుంబాలకుT- SAT చానల్ ద్వారా కోవిడ్ 19 సమయంలో ప్రీ స్కూల్ కార్యకలాపాలు ఏర్పాటు చేసి విద్యను అందించారు. ఇది దేశంలోనే వినూత్నంగా చేయబడిన కార్యక్రమం.
అంగన్ వాడి కేంద్రాల్లో సేవలు సమర్ధవంతంగా అందించేందుకు అంగన్వాడి సిబ్బందికి అందించే గౌరవ వేతనాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 300% పెంచారు.అంగన్వాడి టీచర్ వేతనం రూ.4200 నుండి రూ.13650 కి పెంపు. అంగన్ వాడి హెల్పర్ వేతనం. రూ,2200 నుండి 7800 కి పెంపు.అంగన్ వాడి కార్యకర్తను అంగన్ వాడి టీచర్ గా గౌరవప్రదమైన స్థాయికి చేర్చడం జరిగింది.
 పిల్ల రక్షణ మరియు భద్రత.అనాధలు నిరాదరణకు గురైన పిల్లలను రక్షించడానికి రాష్ట్రంలో 17 శిశుగృహాలు 35 బాల సదనాలు 7 జువైనల్ హోమ్స్ ఏర్పాటు చేయబడినవి. పిల్లల పరిరక్షణ మరియు భద్రత కోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బాల రక్షక భవనాలు ఏర్పాటు అయినవి.ఆపదలో ఉన్న పిల్లలను వెంటనే రక్షించడానికి బాల రక్షక వాహనం ఏర్పాటు సురక్షిత ప్రాంతాలకు చేర్చడం.

* మహిళలు తల్లి బిడ్డల సంక్షేమమే ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం ఇక్కడ క్లిక్ చేయండి 
* ‘రైతుబంధు'కు దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేయండి 


 సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పైలట్

మహిళ రక్షణ భద్రతా మరియు నైపుణ్యాభివృద్ధి సఖి కేంద్రాలు బాధిత మహిళలకు సమీకృత సహాయ సేవలను 24 గంటలు,365 రోజులు అందించడానికి 33 జిల్లాల్లో ఇవి పని చేస్తున్నాయి.భరోసా కేంద్రాలు లైంగిక హింసకు గురైన పిల్లలు మరియు మహిళలకు అవసరమైన సేవలను అందించడం కోసం ఇవి ఏర్పాటు చేయబడ్డాయి.మహిళల హెల్ప్ లైన్ 181 బాధిత మహిళల కోసం ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా 24 గంటలు,365రోజులు సేవలు అందించబడుచున్నది.SHE టాక్సీ ఈ పథకం ద్వారా మహిళా ప్రయాణికుల భద్రత మరియు మహిళల ఉపాధి కోసం మహిళ డ్రైవర్లకు ట్యాక్సీలు సబ్సిడీలో అందించబడతాయి.

మహిళల కోసం భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ మోటార్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం హైదరాబాదులో మహిళా ప్రాంగణంలో ఏర్పాటు చేయబడింది. తెలంగాణ రాష్ట్ర శిశు మరణాల రేటు 39 (2014) నుండి 21 (2020) కి తగ్గింది.తెలంగాణ రాష్ట్రం మాతృ మరణాల రేటు 92 (2014) నుండి 43 (2020)కి తగ్గింది.లింగ నిష్పత్తి (1000 మంది పురుషులకు స్త్రీలు) 1,007నుండి 1,049కి మెరుగుపడింది. గృహహింసను అనుభవించిన 18-49 సంవత్సరాల వివాహిత మహిళలు 42.9% నుండి 36.9% కు తగ్గారు.

 శభాష్ వినీషా,అభినందించిన ఎమ్మెల్యే

పట్టణంలోని గ్రీన్ కాలనీ కి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులైన గొల్ల మొగులప్ప కుమార్తె అయిన గొల్ల వినీష EDCET పరీక్షలో 150 మార్కుల గాను 117.4 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించినందున వినీషాను పట్టణం లోని తులసి గార్డెన్స్ లో నిర్వహించిన తెలంగాణ మహిళా సంక్షేమ సంబురాల ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర EDCET ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన వీనీష ను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సన్మానించారు.జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు.ఈ యొక్క కార్యక్రమం లో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ గారు, ఆర్డీవో అశోక్ కుమార్ గారు, మండల ప్రజా ప్రతినిధులు,అంగన్ వాడీలు,సెర్ఫ్ ఉద్యోగులు, ఐకేపీ ఉద్యోగులు, మెప్మా ఉద్యోగులు,మహిళా సంఘాలు,మరియు స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

* హీరోయిన్,మంత్రి రోజాకు అస్వస్థత ఇక్కడ క్లిక్ చేయండి 
* తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం? ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies