మహిళలు ఉపాధి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
* రోహితన్న మహిళా చేయూత శిక్షణ కార్యక్రమం
* తెలంగాణ ప్రభుత్వానికి ఋణపడి ఉంటాం
* స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు
* ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే పైలెట్
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తాండూర్ నియోజకవర్గంలోని మహిళలకు రోహితన్న మహిళా చేయూత శిక్షణ కార్యక్రమం ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఉద్దేశంతో మరియు ప్రతి ఒక్క మహిళ తమ సొంత కాళ్ళ మీద నిలబడాలని, గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎవరూ కూడా చేయని విధంగా నియోజకవర్గం స్థాయిలో మహిళలకు చేయూతనిచ్చే విధంగా గొప్ప సంకల్పంతో రోహితన్న మహిళా చేయూత అనే శిక్షణ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని తాండూర్, తాండూర్ టౌన్, యాలాల్, బషీరాబాద్ మండలాలకు చెందిన దాదాపుగా 200 మంది మహిళలకు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అయినా శకుంతల దేశ్ పాండే గారి ఆధ్వర్యంలో టైలరింగ్, మగ్గం, జ్యువలరీ, వుడ్ ప్రాసెసింగ్ వంటి స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలను ప్రారంభించి వారికి పూర్తిస్థాయిలో శిక్షణను ఇచ్చి జీవనోపాధి కల్పించడం జరిగింది.
ఈ యొక్క శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న మహిళలు తమ యొక్క సంతోషాన్ని తెలియజేశారు.గతంలో ఎవరు కూడా మా గురించి ఆలోచించలేదు, మా కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయలేదని చెప్పారు.ఈ యొక్క శిక్షణ ద్వారా మేము సొంతంగా షాప్స్ పెట్టుకొని ఉపాధి పొందుతాము అని చెప్పారు. ఈ యొక్క గొప్ప కార్యక్రమము మరియు శిక్షణ ఇంత విజయవంతంగా కావడానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి తల్లి అయిన శ్రీమతి ప్రమోదిని విట్టల్ రెడ్డి గారి యొక్క కృషి ఎంతగానో ఉందని తెలియజేశారు. మేము ఎల్లప్పుడూ ఎమ్మెల్యే గారికి మరియు తెలంగాణ ప్రభుత్వానికి ఋణపడి ఉంటామని అదేవిధంగా రానున్న రోజులో కూడా మా పూర్తిస్థాయి మద్దతు కూడా తెలియజేస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి సహకరించిన ట్రైనర్స్ అయినా శారద, సుజాత, పద్మావతి, అరుణ జ్యోతి గార్లకు ప్రత్యేకంగా మహిళలందరు కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం ట్రైనర్లకు సన్మానం చేసి విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలందరికీ సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరిగింది.