మంచి వర్షాలు కురవాలని సర్పంచ్ శ్రావణ్
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తాండూర్ పట్టణంలో అతి రుద్ర మహాయాగానికి తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ ఆదేశాల మేరకు మంబాపూర్ గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్ మరియు సీనియర్ నాయకులు నారాయణరెడ్డి గారి ఆధ్వర్యంలో యాగానికి సంబంధించిన కార్డ్స్ యాగంలో ప్రజల సంక్షేమం కోసం,మంచి వర్షాలు కురవాలని, గ్రామాలంతా పచ్చగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని నిర్వహిస్తున్న శ్రీ రాజశ్యామల, శత చండి, సౌర, లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగంకు ప్రతి ఒక్కరు రావాలని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క మహాయాగంలో పుణ్య దంపతులు మరియు భక్తులందరూ భాగస్వామ్యం అయి యాగఫలం పొంది అనేక ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్ మరియు సీనియర్ నాయకులు నారాయణరెడ్డి గారు మరియు వార్డ్ మెంబర్స్ అలాగే గ్రామస్తులు పాల్కొన్నారు.